News March 30, 2025
కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం

TG: రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందజేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. దీంతో 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడి.. విశాఖ వాసి గల్లంతు?

AP: జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లోని బైసరీన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో విశాఖ వాసి గల్లంతైనట్లు సమాచారం. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల అక్కడికి టూర్ వెళ్లారు. అయితే దాడి తర్వాత ఆయనకు బంధువులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో చంద్రమౌళి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News April 23, 2025
అదానీ స్పెక్ట్రమ్‌తో ఎయిర్‌టెల్ డీల్

అదానీ డేటా నెట్‌వర్క్స్ 26GHz బ్యాండ్‌లోని 400 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వాడుకునేందుకు ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.212 కోట్లు చెల్లించింది. గుజరాత్, ముంబై, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులోని స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ వినియోగించుకుంటుంది. దీనివల్ల 5G వేగం, నెట్‌వర్క్ కెపాసిటీ పెరగనుంది. యూజర్లకు నాణ్యమైన సేవలు అందుతాయి.
News April 23, 2025
ఉగ్రదాడి వెనుక TRF.. దీని చరిత్ర ఇదే

J&K పహల్గామ్‌లో జరిగిన పాశవిక <<16183726>>ఉగ్రదాడి<<>> వెనుక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)’ ఉన్నట్లు సమాచారం. ఇది పాక్‌కు చెందిన లష్కర్ ఏ తొయిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 AUGలో ఏర్పాటైంది. దీనికి షేక్ సాజిద్ కమాండర్, బాసిత్ అహ్మద్ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని కేంద్రం 2023లో ఉగ్రసంస్థగా ప్రకటించింది. కాగా నిన్న జరిగిన దాడిలో దాదాపు 30 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.