India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఉగాది పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. కామారెడ్డి (D) ఎల్లారెడ్డి (M) వెంకటాపూర్‌లో చెరువులో పడి తల్లి, ముగ్గురు పిల్లలు మృతిచెందారు. చెరువులో స్నానానికి దిగి మునిగిపోతున్న ముగ్గురు పిల్లలను కాపాడేందుకు యత్నించిన తల్లి వారితో పాటు మునిగి చనిపోయారు. మృతులను మౌనిక(26), మైథిలి(10), అక్షర (8), వినయ్(5)గా గుర్తించారు. పండుగ పూట నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ హైదరాబాద్, నల్గొండ, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కిలో చికెన్ రూ.230- రూ.260 వరకు విక్రయిస్తున్నారు. వరుస సెలవుల సందర్భంగా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరను పెంచి అమ్మకాలు చేస్తున్నారు. గత వారం బర్డ్ ఫ్లూ వ్యాప్తి, భయంతో చికెన్ కొనుగోళ్లు పడిపోగా కిలో రూ.150కే అమ్మారు. మీ ప్రాంతంలో కిలో చికెన్ ధర ఎంత ఉందో COMMENT చేయండి.
AP: తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరూ గణనీయమైన ప్రగతి సాధించాలన్నారు. ఈ ఏడాది తెలుగు లోగిళ్లను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఐపీఎల్‌లో ఇవాళ తెలుగు క్రికెట్ ప్రేమికులకు వింత పరిస్థితి నెలకొంది. తెలుగుతో సంబంధం ఉన్న రెండు జట్లు ఢీకొననున్నాయి. విశాఖలో ఢిల్లీ, హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ క్రమంలో కొందరు సొంత జట్టు అంటూ SRHకు మద్దతిస్తున్నారు. మరోవైపు DC ఓనర్ తెలుగువారని, మ్యాచ్ కూడా విశాఖలో జరగనుంది కాబట్టి ఢిల్లీకే మద్దతిస్తామని అంటున్నారు. మరి మీరు ఏ జట్టుకు మద్దతిస్తారో కామెంట్ చేయండి.
AP: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేయనుంది. 10L మంది బాధితులకు ఆ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అగ్రిగోల్డ్‌కు 21,642 ఎకరాల భూములు, లక్ష చ.గజాల స్థలాలున్నాయి. వీటివిలువ 2012లో ₹3,869Cr కాగా ఇప్పుడు మరింత పెరిగింది. ఈ ఆస్తులన్నీ CID ఆధీనంలోనే ఉన్నాయి.
టికెట్ల విషయంలో HCA ఒత్తిడికి గురి చేస్తోందని, HYD వదిలి వెళ్లిపోతామని SRH <<15934651>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో APకి రావాలని SRHకు ఫ్యాన్స్ స్వాగతం పలుకుతున్నారు. IPLలో రాష్ట్రానికి సొంత జట్టు లేకపోవడంతో HYD టీంనే సొంతం చేసుకొని అభిమానిస్తున్నారు. తాజా వివాదంతో రాష్ట్రానికి రావాలని కోరుతున్నారు. మరోవైపు, DC ఓనర్‌ది AP కావడంతో ప్రస్తుతం కొన్ని మ్యాచులు విశాఖలో జరుగుతున్న విషయం తెలిసిందే.
AP: ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ నిపుణులు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 3 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావం గురించి ఇప్పుడు కచ్చితంగా చెప్పలేమని, అయితే రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళ, బుధ వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
AP: పాస్‌పోర్టులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్ 5న స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఆ రోజు కోసం విజయవాడ కేంద్రంలో 800, తిరుపతిలో 500 స్లాట్లను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు కూడా తమ అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్‌లో ప్రతి బుధవారం విజయవాడలో 750 అదనపు అపాయింట్‌మెంట్ల జారీ కొనసాగుతుందని తెలిపింది.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, గురుకులాలు, ఎయిడెడ్, గిరిజన స్కూళ్లలో చదివే 6, 7వ తరగతి బాలురకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 8, 9, 10 తరగతుల విద్యార్థులతోపాటు తమకూ ప్యాంట్లు కావాలని వారు కోరడంతో వీరికి ఏటా 2 జతలు అందించాలని నిర్ణయించింది. దాదాపు 2 లక్షలమందికిపైగా విద్యార్థులకు ప్యాంట్‌తో కూడిన యూనిఫామ్‌ను అందించనుంది.
ఉచిత పాస్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ప్రతినిధి HCA కోశాధికారికి లేఖ రాశారు. కోరినన్ని పాస్‌లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్లు పేర్కొన్నారు. టికెట్ల విషయంలో HCA అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని, ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.