India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పాస్‌పోర్టులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్ 5న స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఆ రోజు కోసం విజయవాడ కేంద్రంలో 800, తిరుపతిలో 500 స్లాట్లను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు కూడా తమ అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్‌లో ప్రతి బుధవారం విజయవాడలో 750 అదనపు అపాయింట్‌మెంట్ల జారీ కొనసాగుతుందని తెలిపింది.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, గురుకులాలు, ఎయిడెడ్, గిరిజన స్కూళ్లలో చదివే 6, 7వ తరగతి బాలురకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 8, 9, 10 తరగతుల విద్యార్థులతోపాటు తమకూ ప్యాంట్లు కావాలని వారు కోరడంతో వీరికి ఏటా 2 జతలు అందించాలని నిర్ణయించింది. దాదాపు 2 లక్షలమందికిపైగా విద్యార్థులకు ప్యాంట్‌తో కూడిన యూనిఫామ్‌ను అందించనుంది.
ఉచిత పాస్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ప్రతినిధి HCA కోశాధికారికి లేఖ రాశారు. కోరినన్ని పాస్‌లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్లు పేర్కొన్నారు. టికెట్ల విషయంలో HCA అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని, ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు.
AP: శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా నేడు 202 మందికి CM చంద్రబాబు పురస్కారాలు అందజేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. పలు రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ కళారత్న అవార్డులకు 86 మందిని, ఉగాది పురస్కారాలకు 116 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. కళారత్న అవార్డు గ్రహీతలను రూ.50వేల నగదు, హంస ప్రతిమ, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10వేల నగదు, మెమెంటో అందిస్తారు.
ఉగాది సందర్భంగా మనమందరం ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇది విశ్వ+వసు అనే 2 పదాల కలయిక. ‘విశ్వం వాసయతి’ అంటే విశ్వాసానికి నివాసాన్ని కలిగించినవాడు, భగవంతుడు అని అర్థం. ఈ పేరు మహావిష్ణువుకూ వర్తిస్తుందని, శుభకారకుడైన శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరిలో సంతోషాన్ని, ప్రేమానురాగాలను పెంపొందిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇది ఏకాదశ గంధర్వ గణాలలో ఒకరైన గంధర్వుడి పేరు అని కూడా చెబుతారు.
ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో సెషల్-2 దరఖాస్తు నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 7, 8, 9వ తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులో త్వరలో రిలీజ్ కానున్నాయి. ఉ.9నుంచి మ.12 గంటల వరకు, మ.3 నుంచి సా.6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
ఇస్రో, నాసా సంయుక్తంగా జూన్ మొదటి వారంలో నిసార్(నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్) శాటిలైట్‌ను ప్రయోగించనున్నాయి. షార్ నుంచి GSLV F-16 ద్వారా 2,800KGల ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. 12 రోజుల్లో భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. పర్యావరణం, మంచు ద్రవ్యరాశి, సముద్ర మట్టం పెరుగుదల, భూకంపాలు, సునామీలపై డేటాను అందిస్తుంది.
తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పర్వదినాన చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి తినాలి. ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. కుటుంబసభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం వినాలి. సృష్టి ఆరంభం రోజు కాబట్టి ఇవాళ కొత్త పనులు మొదలుపెట్టొచ్చు. ఇంద్రధ్వజ, బ్రహ్మ ధ్వజ, రాజదర్శనం పూజలు చేస్తే శుభం కలుగుతుంది. బంగారం, వెండి వంటి వస్తువులు కొనుక్కోవచ్చు.
AP: రాష్ట్రంలోని 126 మండలాల్లో ఇవాళ వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం-20, విజయనగరం-23, మన్యం-13, అల్లూరి-7, విశాఖ-1, అనకాపల్లి-11, కాకినాడ-7, కోనసీమ-7, తూర్పుగోదావరి-19, పశ్చిమగోదావరి-2, ఏలూరు-7, ఎన్టీఆర్-5, గుంటూరు-2, పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే అల్లూరి జిల్లా చింతూరులో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది.
AP: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి రూ.701 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. జిల్లా ప్రధాన రహదారులకు రూ.200cr, రాష్ట్ర ప్రధాన రోడ్లకు రూ.400cr, సీఆర్ఎఫ్ కింద రూ.101cr కేటాయించారు. ఎండీఆర్ కింద ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు నియోజకవర్గాల్లో రహదారుల కోసం భారీగా పనులు మంజూరయ్యాయి. తాజాగా విడుదలైన రూ.400 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 896KM మేర రహదారులను నిర్మించనున్నారు.
Sorry, no posts matched your criteria.