News March 30, 2025
జూన్‌లో ‘నిసార్’ ప్రయోగం

ఇస్రో, నాసా సంయుక్తంగా జూన్ మొదటి వారంలో నిసార్(నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్) శాటిలైట్‌ను ప్రయోగించనున్నాయి. షార్ నుంచి GSLV F-16 ద్వారా 2,800KGల ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. 12 రోజుల్లో భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. పర్యావరణం, మంచు ద్రవ్యరాశి, సముద్ర మట్టం పెరుగుదల, భూకంపాలు, సునామీలపై డేటాను అందిస్తుంది.
Similar News
News April 20, 2025
తొలి మహిళా కమాండో బృందం ‘టీం శివంగి’ ఏర్పాటు

TG: నిర్మల్ జిల్లాలో తొలి మహిళా కమాండో బృందం ‘టీం శివంగి’ ఏర్పాటైంది. ఈ బృందాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘టీం శివంగి’ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మహిళా పోలీసులలోని ఔత్సాహికులకు 45 రోజుల కఠిన శిక్షణ ఇచ్చి కమాండో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయుధాలు, సాంకేతిక, తదితర అంశాలపై వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
News April 20, 2025
రేపటి నుంచి వైన్స్ బంద్

TG: ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి వైన్స్ మూతపడనున్నాయి. HYD, సికింద్రాబాద్‌లోని మద్యం దుకాణాలను ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ జరిగే ఈ నెల 25న వైన్స్ మూసివేయాలన్నారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గౌతమ్ రావు, MIM తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు.
News April 20, 2025
ఎంఐఎం నేతలు విషసర్పాల కంటే ప్రమాదం: బండి

TG: వక్ఫ్ ఆస్తులను దోచుకున్న దొంగలంతా నిన్న హైదరాబాద్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎంఐఎం పార్టీ నేతలు విష సర్పాల కంటే ప్రమాదమని మండిపడ్డారు. ఒవైసీ మీటింగ్‌కు స్పాన్సర్ రేవంత్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయన్నారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.