News March 29, 2025

రాష్ట్రంలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు.. కీలక ప్రకటన

image

TG: రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో VRO, VRAలుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఇంటర్ పూర్తి చేసి VRO/VRAగా కనీసం ఐదేళ్లు పని చేయాలి. వీరికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి ఎంపిక చేస్తారు. విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికెట్ల ఎంక్వైరీ లాంటి విధులు ఉంటాయి.

News March 29, 2025

‘ఆపరేషన్ బ్రహ్మ’.. మయన్మార్‌కు భారత్ సాయం

image

AP: వరుస భూకంపాలతో అల్లాడుతున్న మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ ప్రారంభించింది. ఇందులో భాగంగా మయన్మార్‌లో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ఆస్పత్రి కోసం 118 మంది సిబ్బంది వెళ్తారని కేంద్రం వెల్లడించింది. అక్కడ భూకంపాల ఘటనల్లో భారతీయులెవరూ మృతి చెందలేదని తెలిపింది. సహాయక సామగ్రి చేరవేతకు భారత నౌకాదళం చర్యలు చేపట్టగా, ఇప్పటికే INS సావిత్రి, INS సాత్పుర బయల్దేరాయని చెప్పింది.

News March 29, 2025

సినిమాలు వద్దని నిరాశపరిచారు: జెనీలియా

image

వివాహం తర్వాత సినిమాల్లో తిరిగి నటిద్దామంటే తెలిసిన వాళ్లు ఎవరూ సహకరించలేదని సినీ నటి జెనీలియా అన్నారు. పదేళ్ల తర్వాత సినిమాలోకి వస్తే ఏమాత్రం వర్కౌట్ కాదు అని నిరాశపరిచారన్నారు. అయినా వారి మాటలు వినకుండా ధైర్యంతో మూవీల్లో తిరిగి నటించానని తెలిపారు. 2022లో జెనీలియా నటించిన ‘వేద్’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో జెనీలియా నటించారు.

News March 29, 2025

డెబ్యూలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించాడు

image

పాక్‌తో జరిగిన తొలి వన్డేలో కివీస్ ప్లేయర్ మహమ్మద్ అబ్బాస్ చరిత్ర సృష్టించారు. డెబ్యూ మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(26 బంతుల్లో 52) చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఇందులో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. అలాగే 7 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీశారు. కాగా 5 టీ20ల సిరీస్‌ను 4-1తో కోల్పోయిన పాక్, 3 వన్డేల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో ఓడిపోయింది.

News March 29, 2025

వివేకా హత్య కేసు నిందితులకు త్వరలో సినిమా: ఆదినారాయణ రెడ్డి

image

AP: వివేకా హత్య కేసులో CBI మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని MLA ఆదినారాయణ రెడ్డి అన్నారు. దీంతో ఆ కేసులోని నిందితులకు త్వరలోనే సినిమా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లో MP అవినాశ్ పాత్రే ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు, తనకు YCP నేతల నుంచి ప్రాణహాని ఉందని ఇదే కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఇవాళ కడపలో వాపోయారు.

News March 29, 2025

రోడ్డు ప్రమాదం.. IPS అధికారి దుర్మరణం

image

TG: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వారిలో మహారాష్ట్రకు చెందిన సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కాగా వీరంతా మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News March 29, 2025

రోడ్లు వేయండి.. నిధుల కోసం వెనకాడొద్దు: సీఎం

image

TG: HRDCL రోడ్డు నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరంలో నిర్మించాల్సిన రహదారులు, వాటి విస్తరణలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అవసరమైతే అదనపు స్థల సేకరణ జరపాలని, నిధులకోసం వెనకాడవద్దని స్పష్టం చేశారు.

News March 29, 2025

హిమాచల్‌తో విద్యుత్ ఒప్పందం గొప్ప ముందడుగు: భట్టి

image

TG: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హిమాచల్‌ప్రదేశ్‌తో 520MW ఒప్పందం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇదొక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. థర్మల్ పవర్‌ కంటే జల విద్యుత్ వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. హిమాచల్‌లో జీవ నదులు ఎక్కువగా ఉన్నందున 9-10నెలలు విద్యుత్ ఉత్పత్తికి వీలు ఉంటుందన్నారు. దీంతో తక్కువ ధరకే పవర్ దొరుకుతుందని పేర్కొన్నారు.

News March 29, 2025

ఈ రాశుల వారికి రేపటి నుంచి పండగే!

image

చాలా మంది రాశి ఫలాలను నమ్ముతుంటారు. ఉగాది వచ్చిందంటే చాలు ఆ ఏడాది తమ రాశి ఫలం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. రేపటి నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో కొత్త పంచాంగం అందుబాటులోకి రానుంది. అయితే ఈ నూతన ఏడాది మిథునం, కర్కాటకం, తుల, కన్య రాశుల వారి ఫలితాలు అద్భుతంగా ఉండనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. వీరికి కొత్త ఏడాది శుభ ఫలితాలే. ఇంతకీ మీది ఏ రాశి? COMMENT

News March 29, 2025

వృద్ధ దంపతుల ప్రాణాలు తీసిన సైబర్ నేరగాళ్లు

image

సైబర్ మోసగాళ్ల దోపిడీతో కర్ణాటకకు చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు వీరికి వీడియో కాల్ చేసి తాము ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులమని.. మీపై కేసులయ్యాయని బెదిరించారు. దీంతో భయపడిన దంపతులు తొలుత రూ.5లక్షలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తరచుగా బెదిరిస్తూ రూ.50 లక్షలు దోపిడీ చేశారు. దీంతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి సూసైడ్ లెటర్‌లో ఆత్మహత్య కారణాలు రాశారు.