News March 29, 2025

బయటి జ్యూస్‌లు తాగుతున్నారా?

image

బయటికెళ్లినప్పుడు వేసవి వేడికి తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ జ్యూస్‌లు తాగేస్తుంటాం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. HYDలో ఫుడ్ హబ్‌గా పేరొందిన DLF ప్రాంతంలో పలు జ్యూస్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు. అక్కడ కుళ్లిన పళ్లు, మురికి ఐస్ గడ్డలు, కాలం చెల్లిన పాలు, బొద్దింకలు, ఎలుకల సంచారాన్ని గుర్తించారు. దీంతో ఆ షాప్‌లకు అధికారులు నోటీసులిచ్చారు.

News March 29, 2025

కొత్త సినిమా రికార్డు.. రెండ్రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు!

image

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘L2 ఎంపురాన్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈనెల 27న ఈ చిత్రం విడుదలవగా రెండ్రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని, వీకెండ్ పూర్తయ్యేలోపు మరిన్ని కలెక్షన్లు వస్తాయని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు.

News March 29, 2025

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు

image

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ‘ఇన్‌స్టాగ్రామ్’లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. రీల్స్ చూసేటప్పుడు వీడియోను ఫార్వర్డ్ చేయాలంటే కష్టంగా ఉండేది. కొత్త ఫీచర్ ద్వారా వీడియోకు కుడి/ ఎడమ వైపు లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో 2x స్పీడ్‌లో ఫార్వర్డ్ అవుతుంది. మధ్యలో ప్రెస్ చేస్తే వీడియో పాజ్ అవుతుంది. దీంతోపాటు వాట్సాప్‌లా ఇన్‌స్టాలోనూ మెసెంజర్‌లో మన లొకేషన్ పంపొచ్చు.

News March 29, 2025

ఆ టికెట్లను ఆన్‌లైన్‌లోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు: అశ్వినీ వైష్ణవ్

image

రైలు టికెట్ల రద్దుకు సంబంధించి ఇండియన్ రైల్వే కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే టికెట్ కౌంటర్లలో కొనుగోలు చేసిన టికెట్లనూ ఇకపై IRCTC వెబ్‌సైట్‌లో లేదా 139కి కాల్ చేయడం ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చన్నారు. దీంతో ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు శ్రమ తగ్గుతుందని చెప్పారు. అయితే టికెట్ రీఫండ్ కోసం ఆయా కౌంటర్ల వద్దకే వెళ్లాలని సూచించారు.

News March 29, 2025

IPL చరిత్రలో ఒకే ఒక్కడు

image

ఐపీఎల్ చరిత్రలో 3వేల పరుగులు, 100+ వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. నిన్న RCBతో మ్యాచులో ఈ ఘనతను అందుకున్నారు. ఈ స్పిన్ ఆల్‌రౌండర్ తన ఐపీఎల్ కెరీర్‌లో RR (2008-09), కోచి టస్కర్స్ కేరళ (2011), CSK (2012-15), గుజరాత్ లయన్స్(2016-17), CSK (2018-ప్రస్తుతం) జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటివరకు 242 మ్యాచుల్లో 3,001 రన్స్ చేసి, 160 వికెట్లు పడగొట్టారు.

News March 29, 2025

INDలో 86వేల మంది వద్ద రూ.86 కోట్ల ఆస్తి!

image

ప్రపంచంలో 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల జాబితాలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్‌లు ఉన్నాయి. అమెరికాలో 9,05,413 మంది, చైనాలో 4,71,634, జపాన్‌లో 1,22,119, ఇండియాలో 85,698, జర్మనీలో 69,798, కెనడాలో 64,988, యూకేలో 55,667 మంది వద్ద $10Mల సంపద ఉంది.

News March 29, 2025

రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈనెల 31తో డెడ్‌లైన్ ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

News March 29, 2025

NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు: సీఎం చంద్రబాబు

image

AP: తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఒక మహనీయుడి విజన్ నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని CM చంద్రబాబు తెలిపారు. ‘పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ TDP. NTR లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు. పుట్టాలంటే మళ్లీ ఎన్టీఆరే పుట్టాలి. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది. మనమంతా వారసులం మాత్రమే, పెత్తందారులం కాదు. TDPని లేకుండా చేయాలని చూసినవారు కాలగర్భంలో కలిసిపోయారు’ అని అన్నారు.

News March 29, 2025

OFFICIAL: 1000 మంది మరణం

image

మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం వేలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకూ 1000 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 2000 మంది గాయపడ్డట్లు పేర్కొన్నాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. చాలామంది సాయం కోసం ఎదురుచూస్తుండటంతో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలోనే భారత్ తనవంతు సాయంగా 15 టన్నుల ఆహారపదార్థాలను మయన్మార్‌కు పంపింది.

News March 29, 2025

రెడ్‌బుక్ పేరెత్తితే కొందరికి గుండెపోటు వస్తోంది: లోకేశ్

image

AP: తాను ఎక్కడికి వెళ్లినా రెడ్‌బుక్ గురించి ప్రస్తావన వస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘రెడ్‌బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తోంది. కొందరు బాత్రూమ్‌లో కాలుజారి పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఇగోలు వద్దు. కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పని చేద్దాం’ అని లోకేశ్ అన్నారు.