News March 29, 2025

‘జలియన్‌వాలా బాగ్’పై భారత్‌కు క్షమాపణలు చెప్పాలి: UK ఎంపీ

image

జలియన్‌వాలా బాగ్ ఘటనపై UK సర్కారు భారత్‌కు క్షమాపణలు చెప్పాలని ఆ దేశ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ డిమాండ్ చేశారు. ‘2019లో అప్పటి పీఎం థెరెసా ఆరోజును గుర్తించారు కానీ క్షమాపణలు చెప్పలేదు. బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రలోనే ఈ ఘటన మాయని మచ్చ’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 13, 1919న జలియన్‌వాలా బాగ్‌లో ఈస్టిండియా సర్కారు ఘోర మారణకాండకు పాల్పడింది. వేలాదిమంది అమాయక పౌరుల్ని మైదానంలోనే కాల్చి చంపించింది.

News March 29, 2025

Xను విక్రయించిన ఎలాన్ మస్క్

image

తన సోషల్ మీడియా సంస్థ X(ట్విటర్)ను తన AI కంపెనీ xAIకు విక్రయించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందుకోసం xAI $45B చెల్లించనుంది. $12B అప్పు పోగా X విలువ $33Bగా ఉండనుంది. xAI వాల్యూ $80B అని మస్క్ పేర్కొన్నారు. ఇక నుంచి ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, కలిసి పని చేస్తాయని తెలిపారు. ఈ కంబైన్డ్ కంపెనీ యూజర్లకు జ్ఞానంతో పాటు ఉపయోగకరమైన అనుభవాలను ఇస్తుందని పేర్కొన్నారు.

News March 29, 2025

అమరావతిలో చంద్రబాబు ఇల్లు.. ఏప్రిల్ 9న భూమి పూజ

image

AP: సీఎం చంద్రబాబు అమరావతిలో ఇల్లు నిర్మించుకోనున్నారు. దీనికి ఏప్రిల్ 9న భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. గత ఏడాది చివర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని E6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ స్థలానికి, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు మధ్య 2కి.మీ దూరం ఉంటుంది. కాగా పీఎం మోదీ చేతుల మీదుగా త్వరలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

News March 29, 2025

రాజీవ్ యువ వికాసం గైడ్ లైన్స్ ఇవే..

image

* వ్యవసాయేతర పథకాలకు వయసు 21-55 మధ్య ఉండాలి.
* వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి.
* కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది.
* రూ.50వేల యూనిట్లకు 100శాతం సబ్సిడీ, రూ.50వేల నుంచి రూ.లక్ష మధ్య యూనిట్లకు 90శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80శాతం, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70శాతం రాయితీ అందిస్తారు. మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ల ద్వారా ప్రభుత్వం సమకూరుస్తుంది.

News March 29, 2025

ఏపీలో వాటర్ ఎయిర్ పోర్టులు.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు సీ ప్లేన్ సేవల్ని ఆరంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్రతీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని CM చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC వచ్చే 3లోపు ప్రతిపాదనల్ని ఆహ్వానించింది.

News March 29, 2025

ధోనీ ముందే రావచ్చుగా.. ఫ్యాన్స్ ఆవేదన

image

నిన్న RCB చేతిలో CSK ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. చెన్నై 6 వికెట్లు కోల్పోయి 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చారు. 16 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సీఎస్కే బ్యాటర్లలో ఆయనదే అత్యధిక స్ట్రైక్ రేట్. ఇలా ఆడే సామర్థ్యం ఉన్న ఆయన జడేజా, అశ్విన్‌ కంటే ముందు వచ్చి ఉంటే మ్యాచ్‌ గెలిచేవాళ్లం కదా అంటూ సీఎస్కే ఫ్యాన్స్ నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 29, 2025

రేపు, ఎల్లుండి ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఓపెన్

image

AP: ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. 3 రోజులే అవకాశం ఉండడంతో ఈనెల 30, 31 తేదీల్లోనూ పన్ను వసూళ్ల కౌంటర్లు పనిచేసేలా మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉ.6 నుంచి రా.9 గంటల వరకు కౌంటర్ల వద్ద పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

News March 29, 2025

BREAKING: మరో దేశంలో భూకంపం

image

మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాన్ని మరువకముందే మరో దేశంలో భూమి కంపించింది. అఫ్గాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఇవాళ ఉ.5.16 గంటలకు భూమి కంపించినట్లు తెలిపింది. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్, భారత్‌, చైనా తదితర దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

News March 29, 2025

కొత్త సినిమాల సీక్వెల్స్, ప్రీక్వెల్స్ టైటిల్స్ ఇవే!

image

ఈవారం 4 సినిమాలు రిలీజవగా వీటి సీక్వెల్స్, ప్రీక్వెల్స్‌ను మేకర్స్ ప్రకటించారు. నిన్న రిలీజైన ‘మ్యాడ్ స్క్వేర్’కు సీక్వెల్ ‘మ్యాడ్ క్యూబ్’ ఉండనుంది. హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాకు సీక్వెల్ ‘బ్రదర్‌హుడ్ ఆఫ్ రాబిన్‌హుడ్’ ఉంటుందని హింట్ ఇచ్చారు. మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’కు కొనసాగింపుగా ‘L3: ది బిగినింగ్’, విక్రమ్ హీరోగా వచ్చిన ‘వీర ధీర శూర’కు ప్రీక్వెల్‌గా పార్ట్-1 రానుంది.

News March 29, 2025

పరీక్షలు రాయాలంటే 75% హాజరు తప్పనిసరి!

image

వచ్చే విద్యాసంవత్సరం నుంచి CBSE 12వ తరగతి పరీక్షలు రాయాలంటే 75% హాజరు తప్పనిసరి చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్యవిద్య కోసమే 12వ తరగతి ఎగ్జామ్స్ రాసేందుకు డబ్బులు చెల్లించి నకిలీ పాఠశాలల్లో చేరుతున్నట్లు గుర్తించింది. తనిఖీల సమయంలో స్కూళ్లలో విద్యార్థులు లేకున్నా వారిని పరీక్షకు అనుమతించరు. అలాంటివారు ఓపెన్ స్కూల్‌లో ఎగ్జామ్స్ రాసుకోవాలని CBSE సూచించింది.