News March 29, 2025
రాజీవ్ యువ వికాసం గైడ్ లైన్స్ ఇవే..

* వ్యవసాయేతర పథకాలకు వయసు 21-55 మధ్య ఉండాలి.
* వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి.
* కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది.
* రూ.50వేల యూనిట్లకు 100శాతం సబ్సిడీ, రూ.50వేల నుంచి రూ.లక్ష మధ్య యూనిట్లకు 90శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80శాతం, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 70శాతం రాయితీ అందిస్తారు. మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ల ద్వారా ప్రభుత్వం సమకూరుస్తుంది.
Similar News
News April 22, 2025
మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జనరల్ కేటగిరీ సిబ్బంది కుదింపు పూర్తయ్యింది. మే మొదటి వారం నాటికి మిగిలిన 11 కేటగిరీల ఉద్యోగుల రేషనలైజేషన్ పూర్తవుతుందని సమాచారం. ఆ వెంటనే 2, 3 వారాల్లో బదిలీలను చేపడతారని తెలుస్తోంది. సచివాలయాల పరిధిలో జనాభా ఆధారంగా ఒక్కో ఆఫీసులో 6-8 మంది సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
News April 22, 2025
గ్రామీణ డాక్ సేవక్: సెకండ్ లిస్టు విడుదల

దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన వారి రెండో జాబితా విడుదలైంది. <
News April 22, 2025
DCvsLSG: బదులు తీర్చుకుంటుందా?

IPL: లక్నో వేదికగా ఇవాళ LSG, DC తలపడనున్నాయి. స్టార్ ప్లేయర్లు పంత్, రాహుల్ తమ మాజీ జట్లతో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఢిల్లీ ఏడు మ్యాచ్‌ల్లో 5, లక్నో 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా చెరో 3 విజయాలు సాధించాయి. కాగా ఈ సీజన్ ఆరంభంలో లక్నోతో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి బంతికి ఢిల్లీ విజయం సాధించింది. మరి లక్నో ఇవాళ బదులు తీర్చుకుంటుందా? COMMENT