India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPLలో ఇవాళ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచుకు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ ఇవాళ తుది జట్టులోకి రానున్నారు. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు 5 సార్లు తలపడ్డాయి. మూడింట్లో GT, రెండింట్లో MI గెలిచింది. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌ను రెండు జట్లు ఓటమితోనే ఆరంభించాయి. నేడు గెలుపు బోణీ కొట్టేదెవరో?
TG: ఎండలు ముదిరిన నేపథ్యంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 4,818 చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 458, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 8 చలివేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. వాటర్ బాటిల్స్ కొనుక్కోకుండా, చలివేంద్రాల్లో ఉచితంగా నీటిని తాగాలని అధికారులు సూచిస్తున్నారు.
AP: గురుకుల స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగిలిన ఖాళీల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 6లోగా https://aprs.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్షకు కూడా ఏప్రిల్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని సూచించారు.
జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్న ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్ తొలి గోల్డ్ మెడల్ సాధించింది. మహిళా రెజ్లర్ మనీషా భన్వాలా 62kgs విభాగంలో స్వర్ణ పతకం గెలిచారు. ఫైనల్‌లో ఉత్తర కొరియా ప్లేయర్ జె కిమ్‌పై 8-7 తేడాతో విజయం సాధించారు. మరో రెజ్లర్ అంతిమ్ పంఘల్ (53kgs) కాంస్యం గెలిచారు. దీంతో ఇప్పటివరకు భారత్ గెలిచిన మెడల్స్ సంఖ్య 7కు (1 గోల్డ్, 1 సిల్వర్, 5 బ్రాంజ్) చేరింది.
TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా, ఏప్రిల్ 6 నుంచి 30 వరకు అప్లికేషన్లను పరిశీలించనున్నారు. జూన్ 2న మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తారు.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో CSKపై RCB దాదాపు 17 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2008లో చెన్నైను ఓడించిన బెంగళూరు.. మళ్లీ 6,155 రోజుల తర్వాత ఇప్పుడు గెలుపును నమోదు చేసింది. అందుకే ఈ విజయం RCBకి చాలా స్పెషల్. ఈ సీజన్‌లో పాటీదార్ సేనకు ఇది రెండో విజయం. 4 పాయింట్లతో ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగించి ఛాంపియన్‌గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
RCBతో మ్యాచులో తాము ఓడిపోవడానికి ఫీల్డింగ్ సరిగా చేయకపోవడమే కారణమని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు. ‘ఈ పిచ్‌పై 170 మంచి స్కోర్. RCB 20 రన్స్ అదనంగా చేసింది. మా ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచులు వదిలేశారు. పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు కొంచెం భిన్నంగా బ్యాటింగ్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే వికెట్లు కోల్పోయాం. కేవలం 50 రన్స్ తేడాతో ఓడాం. భారీ తేడాతో ఓడనందుకు సంతోషం’ అని పేర్కొన్నారు.
తీవ్ర భూప్రకంపనలతో ఉలిక్కిపడిన మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. అంతకుముందు మయన్మార్, థాయిలాండ్‌లో 7.7 తీవ్రతతో భూకంపం రావడంతో భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1932: కవి కొప్పరపు వేంకట సుబ్బరాయ మరణం
1950: నటుడు ప్రసాద్ బాబు జననం
1952: తెలుగు రచయిత కె.ఎన్.వై.పతంజలి జననం
1953: స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు మరణం
1982: నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు
2016: సినీ నిర్మాత కాకిత జయకృష్ణ మరణం
Sorry, no posts matched your criteria.