News January 6, 2025

ఆలయాలకు స్వయం ప్రతిపత్తి.. మీ కామెంట్!

image

సనాతన ఎకానమీకి ఆలయాలే కేంద్ర బిందువులు. వాటి ఆధారంగానే రాఖీ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఎంత బిజినెస్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ ఆదాయం కోసమే మందిరాలను ప్రభుత్వాలు తమ పరిధిలోకి తీసుకున్నాయన్న విమర్శలున్నాయి. ఇకనైనా చెర విడిపించాలని, గుళ్లకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్, నిన్న VHP హైందవ శంఖారావంలో వక్తలు దీనిపై గళమెత్తారు. మరి మీరేమంటారు?

Similar News

News January 25, 2025

మీర్‌పేట్ ఘటన.. పోలీసులకు సవాల్

image

HYDలో భార్యను నరికి ముక్కలుగా ఉడికించిన <<15250914>>కేసు <<>>దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితుడు చెప్పినట్టు మృతదేహాన్ని బూడిదగా మార్చి చెరువులో వేసినట్లైతే అది నిరూపించడం, ఘటనా స్థలంలో దొరికిన శాంపిల్స్ ల్యాబ్‌కు పంపి అవి మనిషివని నిరూపించడం పెద్ద టాస్కే. అది మాధవి శరీరమని నిరూపించేలా ఆమె పేరెంట్స్, పిల్లల DNA శాంపిల్స్ విశ్లేషించాలి. ఇందుకోసం టాప్ ప్రొఫెషనల్స్‌ను పోలీసులు సంప్రదిస్తున్నారు.

News January 25, 2025

‘తండేల్’ ట్రైలర్ ఎప్పుడంటే?

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ మూవీ ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ రాసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News January 25, 2025

ప్రజల సొమ్ముతో తండ్రీకొడుకులు ఎంజాయ్ చేశారు: వైసీపీ

image

AP: బిల్డప్పులు కొట్టడం తప్ప చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఏం లాభం లేదని వైసీపీ విమర్శించింది. ప్రజల సొమ్ముతో తండ్రీకొడుకులు దావోస్‌లో ఎంజాయ్ చేసి వచ్చారని దుయ్యబట్టింది. 40 ఏళ్ల అనుభవమని, ఉత్త చేతులతో వచ్చారని సెటైర్లు వేసింది. దావోస్ పర్యటన డిజాస్టర్ అయిందని, బాబు పాలనని నమ్మి ఒక్క కంపెనీ MOU చేసుకోలేదని మండిపడింది.