News December 3, 2024
రాష్ట్రంలో 7న ఆటోల బంద్
TG: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని బంద్‌తో పాటు ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు AITUC నేతలు తెలిపారు. నిన్న హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో ‘బంద్’ గోడపత్రికలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమల్లోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
Similar News
News January 16, 2025
క్రెడిట్ కార్డు యూజర్లకు పోలీసుల సూచనలు
క్రెడిట్ కార్డు యూజర్లను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లపై బంపర్ ఆఫర్ అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకుల పేరిట వచ్చే మెసేజ్‌లను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని TG పోలీసులు సూచించారు. రివార్డు పాయింట్ల కోసం APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దన్నారు. అత్యాశకు వెళ్తే అకౌంట్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు.
News January 16, 2025
BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోలు మృతి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇటీవల మావోలు మందుపాతర పేల్చడంతో ఎనిమిది మంది పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే.
News January 16, 2025
జారిపడ్డ పోప్.. చేతికి గాయం
పోప్ ఫ్రాన్సిస్ గాయపడ్డట్లు వాటికన్ సిటీ అధికారులు తెలిపారు. శాంటా మార్టాలోని తన నివాసంలో ఆయన ప్రమాదవశాత్తు జారి పడటంతో మోచేతికి గాయమైనట్లు వెల్లడించారు. అయితే ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ కాలేదని, గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టినట్లు పేర్కొన్నారు. కాగా గడిచిన రెండు నెలల్లో పోప్ గాయపడటం ఇది రెండోసారి. ఇటీవల ఆయన బెడ్ పైనుంచి కింద పడటంతో దవడకు దెబ్బ తగిలింది.