News October 15, 2024
వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874: నాబార్డు
TG: రాష్ట్రంలో 55% మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు నాబార్డు తెలిపింది. మిగతా 45% శాతం కుటుంబాలు వ్యవసాయేతర పనులు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు సగటున 2 ఎకరాల భూమి ఉందని తెలిపింది. వ్యవసాయ కుటుంబం నెలవారీ సగటు ఆదాయం రూ.13,874 ఉండగా, నెలవారీ ఖర్చు రూ.13,093గా ఉంది. తగినంత ఆదాయం లేకపోవడంతో తమ భూములను కౌలుకు ఇచ్చి, ఉద్యోగాలు చేసుకుంటున్నాయని వెల్లడించింది.
Similar News
News November 11, 2024
ఎన్నికల ఫలితాలు సరిగ్గా అంచనా వేస్తే రూ.కోటి రివార్డు
MPకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డా.PN.మిశ్రా అదిరిపోయే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రాబోయే మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా అంచనా వేస్తే రూ.కోటి బహుమతి ఇస్తానని ప్రకటించారు. సరిగ్గా అంచనా వేయలేకపోయినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని షరతు పెట్టారు. కొందరు శాస్త్రీయ ఆధారాలు లేకుండా అంచనాలు వేస్తూ, మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారని అంటున్నారు.
News November 11, 2024
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
AP: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పీకలదాకా మద్యం తాగిన జగదీశ్ అనే సీనియర్ విద్యార్థి పది మంది జూనియర్లను ర్యాగింగ్ చేశాడు. కారిడార్‌లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నరకం చూపించాడు. ఎదురుతిరిగిన ముగ్గురిని కొట్టాడు. దీంతో వారు తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు.
News November 11, 2024
శివుడంటే ఎవరు? శివమంటే ఏంటి?
సర్వాంతర్యామి తత్వానికి ప్రతీక శివుడు. అందుకే ఆ మహాదేవుడు లింగ రూపంలో మనకోసం ఉద్భవించాడు. లింగానికి ఏది ముందు, ఏది వెనక వైపు అనేది లేదు. నువ్వే దిక్కని మనం ఏ దిక్కు నుంచి కొలిచినా ఆయన అపార కరుణామృతాన్ని మనపై వర్షిస్తాడు. దైవ రూపంలో మొదటిది లింగం. అది బ్రహ్మాండము, పూర్ణముకు చిహ్నం. అందులేనిది లేదు. అన్నీ ఆ అండము నుంచే ఏర్పడ్డాయి. శివమనగా సర్వశుభకరమని, శివుడనగా సర్వ శుభాలను చేకూర్చువాడని అర్థం.