News December 31, 2024
ఒంట్లో సగటు ఉష్ణోగ్రత 98.6F డిగ్రీలు కాదు: స్టడీ

థర్మా మీటర్లో 98.6F డిగ్రీల వేడి దాటేసిందంటే జ్వరమొచ్చిందని భావిస్తాం. నిజానికి మనమంతా అనుకుంటున్న ఈ సగటు ఉష్ణోగ్రత కరెక్టు కాదని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు అంటున్నారు. 2008-17 మధ్య వేర్వేరు వయసు, ఎత్తు, బరువు, లింగభేదం, BMI ఉన్న 6.18L మందిని Dr జూలీ పర్సోనెంట్ బృందం పరిశీలించింది. వారిలో సాధారణ టెంపరేచర్ 97.3 – 98.2°F మధ్యే ఉన్నట్టు గుర్తించింది. మారిన పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది.
Similar News
News December 29, 2025
ఆ దేశాలతో పూర్తి స్థాయి యుద్ధం: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్, యూరప్‌తో తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఇరాన్ సొంత కాళ్లపై నిలబడటం పశ్చిమ దేశాలకు ఇష్టం లేదని, తమను మోకరిల్లేలా చేయాలని అనుకుంటున్నాయని చెప్పారు. ‘ఇది మనపై ఇరాక్ చేసిన యుద్ధం కంటే దారుణమైనది. చాలా క్లిష్టమైనది. అన్నివైపుల నుంచి ముట్టడిస్తున్నారు. జీవనోపాధి, భద్రతాపరంగా సమస్యలు సృష్టిస్తున్నారు’ అని అన్నారు.
News December 29, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 29, 2025
‘OP సిందూర్’లో మా ఎయిర్‌బేస్‌పై దాడి జరిగింది: పాక్ Dy PM

ఆపరేషన్ సిందూర్ సమయంలో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిందని పాక్ Dy PM ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. కానీ ఇండియా దాడిని సమర్థంగా అడ్డుకున్నట్లు గొప్పలకుపోయారు. ‘వాళ్లు(ఇండియా) మా పైకి 36 గంటల్లో 80 డ్రోన్లు పంపారు. మేం 79 ఇంటర్సెప్ట్ చేశాం. ఒకటి మాత్రం మా సైనిక స్థావరాన్ని డ్యామేజ్ చేసింది. మే 10న నూర్ ఖాన్ బేస్‌పై దాడితో ఇండియా తప్పు చేసింది. దీంతో పాక్ ప్రతీకార చర్యకు దిగింది’ అని చెప్పారు.


