News December 9, 2024

ఆరోగ్యానికి ఈ ఐదింటినీ దూరం పెట్టాలి: నిపుణులు

image

చక్కటి ఆరోగ్యం కావాలంటే పంచదార, వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, అయోడైజ్డ్ సాల్ట్, వెన్నను ఆహారం నుంచి దూరం పెట్టాలని మధుమేహ నిపుణులు సూచిస్తున్నారు. ‘వీటి వల్ల డయాబెటిస్ ముప్పు తీవ్రంగా ఉంటుంది. హృద్రోగాలు తలెత్తుతాయి. అయోడైజ్డ్ సాల్ట్ బదులు కళ్లు ఉప్పు లేదా పింక్ సాల్ట్‌ను వాడాలి. చక్కెర, తెల్ల రొట్టెను పూర్తిగా నివారించాలి. వెన్న నుంచి వచ్చే కొవ్వులు ఒక్కోసారి గుండెకు చేటు’ అని వివరించారు.

Similar News

News March 27, 2026

పెళ్లయిన వ్యక్తి మరొకరితో సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

image

పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. నైతికత, చట్టం వేర్వేరు అని పేర్కొంది. చట్టం ప్రకారం నేరం రుజువు కానప్పుడు పౌరుల హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానం తీసుకునే చర్యలను సామాజిక అభిప్రాయాలు, నైతికత నిర్దేశించలేవంది. లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న జంట రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది.

News March 27, 2026

నైవేద్యంగా వడపప్పు, పానకం.. ఎందుకంటే?

image

శ్రీరామనవమి రోజున వడపప్పు, పానకం నైవేద్యంగా ఇవ్వడం వెనుక ఆరోగ్య, ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుండటంతో ఈ బెల్లంతో చేసిన పానకం ‘ఎనర్జీ డ్రింక్’లా పనిచేస్తుంది. నానబెట్టిన పెసరపప్పు (వడపప్పు) శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది. రాముడికి ఇష్టమైన ఈ సాత్విక ఆహారాన్ని శ్రీరామనవమి నాడు సమర్పిస్తే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం.

News March 27, 2026

ఈ తగ్గింపు ఎన్నికల వరకేనా: రాజ్‌దీప్

image

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎన్నికల(మే 4) వరకేనా లేక కొనసాగుతుందా? అని జర్నలిస్ట్ రాజ్‌దీప్ ప్రశ్నించారు. గతంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఎందుకు చేకూర్చలేదని విమర్శించారు. ఇంధన ధరలు మార్కెట్ పరిస్థితుల కంటే ఎన్నికలపై ఆధారపడ్డాయని ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.