News December 9, 2024
ఆరోగ్యానికి ఈ ఐదింటినీ దూరం పెట్టాలి: నిపుణులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733652890856_1045-normal-WIFI.webp)
చక్కటి ఆరోగ్యం కావాలంటే పంచదార, వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, అయోడైజ్డ్ సాల్ట్, వెన్నను ఆహారం నుంచి దూరం పెట్టాలని మధుమేహ నిపుణులు సూచిస్తున్నారు. ‘వీటి వల్ల డయాబెటిస్ ముప్పు తీవ్రంగా ఉంటుంది. హృద్రోగాలు తలెత్తుతాయి. అయోడైజ్డ్ సాల్ట్ బదులు కళ్లు ఉప్పు లేదా పింక్ సాల్ట్‌ను వాడాలి. చక్కెర, తెల్ల రొట్టెను పూర్తిగా నివారించాలి. వెన్న నుంచి వచ్చే కొవ్వులు ఒక్కోసారి గుండెకు చేటు’ అని వివరించారు.
Similar News
News January 14, 2025
జనవరి 14: చరిత్రలో ఈరోజు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736789659977_1226-normal-WIFI.webp)
1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం
1980: సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి మరణం
News January 14, 2025
స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలి: హరీశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734001620729_893-normal-WIFI.webp)
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయమై డీజీపీ జితేందర్‌కి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలని కోరారు. మరోవైపు పోలీసులు ఎమ్మెల్యేను అనూహ్యంగా త్రీటౌన్ స్టేషన్ కు తరలించారు. జడ్జి ముందుకు ప్రవేశపెట్టే విషయంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆయనకు స్టేషన్‌లో బస ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
News January 14, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736790455626_1226-normal-WIFI.webp)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.