News August 21, 2024

IRCTC ప్యాకేజీతో ఒకే ట్రిప్‌లో అయోధ్య, వారణాసి దర్శనాలు

image

సికింద్రాబాద్, కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ నుంచి సాగే ఈ యాత్ర(5 రాత్రులు, 6 పగళ్లు) SEP 22 నుంచి అందుబాటులో ఉంటుంది. కాశీ విశ్వనాథ్, కాలభైరవ ఆలయం, గంగా హారతి, అయోధ్య, దశరథ్ మహల్, సరయు ఘాట్ చూడొచ్చు. 3 పూటలా ఫుడ్, రూమ్స్ ఏర్పాటు చేస్తారు. ACలో ట్విన్ షేరింగ్‌కు ₹24,350, ట్రిపుల్ షేరింగ్‌కు ₹19,720, స్లీపర్‌లో ట్విన్ షేరింగ్‌కు ₹17,220, ట్రిపుల్ షేరింగ్‌కు ₹16,710 చెల్లించాలి.

Similar News

News December 15, 2025

‘వారణాసి’లో మహేశ్ తండ్రిగా ప్రకాశ్ రాజ్?

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘వారణాసి’ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. మహేశ్ తండ్రి పాత్ర కోసం ఆయనను తీసుకున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే ఈ పాత్ర కోసం ఇద్దరు నటులపై టెస్ట్ షూట్ చేసినా జక్కన్న సంతృప్తి చెందలేదని సమాచారం. చివరగా ఈ పాత్రకు ప్రకాశ్ రాజ్ న్యాయం చేస్తారని దర్శకధీరుడు నమ్మడంతో ఆయన సెట్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

News December 15, 2025

ఇది రేవంత్‌కు చెంపపెట్టు.. ప్రజాగ్రహానికి సంకేతం: KTR

image

TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని KTR అన్నారు. ‘రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ BRS అద్వితీయ ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ మంత్రుల, MLAల నియోజకవర్గాల్లోనూ సత్తా చాటింది. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ఇక కాలం చెల్లిందని ప్రజలు ఓటుతో మరోసారి తేల్చిచెప్పారు. ఈ ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు. INC సగం స్థానాలను కూడా గెలవకపోవడం ప్రజాగ్రహానికి సంకేతం’ అని ట్వీట్ చేశారు.

News December 15, 2025

క్రమంగా పుంజుకుంటోన్న అరటి ధరలు

image

AP: గత నెలలో కిలో రూ.2కు పడిపోయిన అరటి ధరలు.. ఉత్తరాది వ్యాపారుల కొనుగోలుతో ఇప్పుడు పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం కిలో అరటి ధర కనీసం రూ.10, గరిష్ఠంగా రూ.16, రూ.17గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో అరటి సాగు పెరగడం, తక్కువ ధరకే నాణ్యమైన అరటి లభించడంతో ఉత్తరాది వ్యాపారులు అక్కడి సరుకునే కొనడంతో.. ఏపీలో అరటి ధర భారీగా పతనమై ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలకు ఎగుమతి నిలిచింది.