News August 21, 2024
IRCTC ప్యాకేజీతో ఒకే ట్రిప్‌లో అయోధ్య, వారణాసి దర్శనాలు
సికింద్రాబాద్, కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ నుంచి సాగే ఈ యాత్ర(5 రాత్రులు, 6 పగళ్లు) SEP 22 నుంచి అందుబాటులో ఉంటుంది. కాశీ విశ్వనాథ్, కాలభైరవ ఆలయం, గంగా హారతి, అయోధ్య, దశరథ్ మహల్, సరయు ఘాట్ చూడొచ్చు. 3 పూటలా ఫుడ్, రూమ్స్ ఏర్పాటు చేస్తారు. ACలో ట్విన్ షేరింగ్‌కు ₹24,350, ట్రిపుల్ షేరింగ్‌కు ₹19,720, స్లీపర్‌లో ట్విన్ షేరింగ్‌కు ₹17,220, ట్రిపుల్ షేరింగ్‌కు ₹16,710 చెల్లించాలి.
Similar News
News September 19, 2024
వరద బాధితులకు అదానీ రూ.25 కోట్ల విరాళం
AP: విజయవాడ వరద బాధితులకు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ.25 కోట్ల భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ సంస్థ ప్రతినిధి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ‘ఏపీలో వరదల కారణంగా అపార నష్టం సంభవించడం బాధాకరం. అదానీ గ్రూప్ తరఫున రాష్ట్ర ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం’ అని అదానీ ట్వీట్ చేశారు.
News September 19, 2024
అశ్విన్ హాఫ్ సెంచరీ
బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్ అశ్విన్ అదరగొడుతున్నారు. టాప్ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై బ్యాటుతో రాణించి హాఫ్ సెంచరీ చేశారు. 58బంతుల్లో 50 రన్స్ చేశారు. 144/6 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మరో ఎండ్‌లో జడేజా(34) ఉన్నారు. వీరిద్దరు 102 బంతుల్లో 89 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 233/6గా ఉంది.
News September 19, 2024
YSRను తిట్టినవారికే మంత్రి పదవులు ఇచ్చారు: బాలినేని
AP: తాను ఏ తప్పూ చేయకపోయినా మంత్రి పదవి నుంచి తీసేశారని వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కానీ వైఎస్ఆర్‌ను తిట్టినవారిని మాత్రం మంత్రి పదవుల్లో కొనసాగించారని ఆయన అన్నారు. ‘నేనెప్పుడూ వ్యక్తిగత అవసరాల కోసం జగన్‌ను కలవలేదు. ప్రజా సమస్యల కోసమే ఆయనను కలిశాను. జగన్ కోసం ఉప ఎన్నికలకు వెళ్లిన 17 మందిలో ఇప్పుడు ఒక్కరైనా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.