News December 2, 2024
అయోధ్య లాంటి ఉద్యమం చేయాలి: కర్ణాటక MLA

కర్ణాటక బీదర్ జిల్లాలో అనుభవ మంటపం పునర్నిర్మాణానికి అయోధ్య లాంటి ఉద్యమం చేపట్టాలని విజయపుర MLA బసనగౌడ పాటిల్ పిలుపునిచ్చారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ మంటపం ఉన్న స్థానంలో ముస్లిం సాధువు దర్గా పీర్ పాషా బంగ్లాను ఏర్పాటు చేశారన్నారు. త్వరలోనే ఉద్యమం ప్రారంభించి, మంటపం తిరిగి అదే స్థలంలో నిర్మించే వరకు పోరాటం ఆగదన్నారు. వివిధ లింగాయత్ మఠాల మఠాధిపతులు పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
Similar News
News November 24, 2025
ముంబైలో “పాతాళ్ లోక్” నెట్వర్క్

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్ నెట్వర్క్ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్ నెట్వర్క్ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.
News November 24, 2025
3 సిక్సులు కొట్టడమే గొప్ప!

పాకిస్థాన్‌కు చెందిన జీరో స్టూడియోస్ ఆ దేశ క్రికెటర్ సాహిబ్జాదా ఫర్హాన్‌పై “Hero in the Making” అనే డాక్యుమెంటరీ తీసింది. దానికి అసలు కారణం ఏంటంటే ఆసియా కప్ 2025లో అతను బుమ్రా బౌలింగ్‌లో 3 సిక్సులు కొట్టడమే. కాగా ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడిపోవడం తెలిసిందే. దీంతో ‘3 సిక్సులు కొట్టడాన్నే వీళ్లు సక్సెస్‌గా ఫీల్ అవుతున్నారు’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
News November 24, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 156 పోస్టులు

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<


