News February 3, 2025
అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడి ఆరోగ్యం విషమం!

అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి నుంచి మొదట ట్రామా సెంటర్‌కి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అయోధ్య సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు. CT స్కాన్‌లో ఆయన మెదడులో రక్తస్రావం జరిగినట్లు తేలిందని వెల్లడించారు.
Similar News
News February 9, 2025
రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్‌లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.
News February 9, 2025
SA20 టోర్నీ విజేతగా MI కేప్‌టౌన్

SA20-2025 టైటిల్‌ను MI కేప్‌టౌన్ గెలుచుకుంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్‌లో 76 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత MI 181-8 స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ 105 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీ చరిత్రలో MIకి ఇదే తొలి టైటిల్. కాగా తొలి రెండు సీజన్లలో సన్ రైజర్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
News February 9, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.