News March 8, 2025
బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్

AP: గుంటూరు ANUలో బీఎడ్ ప్రశ్నాపత్రం <<15680685>>లీకేజీ<<>> ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు ఒడిశాకు చెందిన ఏజెంట్లని, ఆ రాష్ట్ర విద్యార్థులకు ఏపీలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తుంటారని తెలిపారు. అలాగే పాస్ చేయించేందుకు క్వశ్చన్ పేపర్లను లీక్ చేస్తుంటారని గుర్తించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.
Similar News
News March 25, 2025
ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలేను భారతరత్నతో సత్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా CM ఫడణవీస్ మాట్లాడుతూ ‘మహాత్మా బిరుదు దేశంలో అన్నింటికన్నా గొప్పది. దీనిని ప్రజలు ఫూలే, గాంధీకి మాత్రమే ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఫూలే దంపతులు 19వ శతాబ్దంలో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
News March 25, 2025
నేడు, రేపు సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు CCLA ప్రారంభ ఉపన్యాసం, ఆ తర్వాత CS, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం కలెక్టర్ల సమావేశంపై సీఎం ప్రసంగిస్తారు. నేడు వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.
News March 25, 2025
బండి సంజయ్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి: బీఆర్ఎస్

TG: మాజీ సీఎం, BRS అధినేత KCRపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సంజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అక్కడ ప్రింట్ చేసిన డబ్బునే ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారని BRS తన ఫిర్యాదులో పేర్కొంది.