News November 23, 2024

వెనుకంజలో బాబా సిద్ధిఖీ కుమారుడు

image

MHలో ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కుమారుడు జీష‌న్ వాంద్రే ఈస్ట్ నుంచి వెనుకంజ‌లో ఉన్నారు. ఆయ‌న‌పై శివ‌సేన UBT అభ్య‌ర్థి వ‌రుణ్‌ స‌తీశ్ 10K ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వివాదాస్ప‌ద NCP నేత న‌వాబ్ మాలిక్ మ‌న్‌ఖుద్ర్ శివాజీ న‌గ‌ర్‌లో నాలుగో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఆయ‌న కుమార్తె స‌నా మాలిక్ అనుశ‌క్తి న‌గ‌ర్‌లో న‌టి స్వ‌రా భాస్క‌ర్ భ‌ర్త ఫ‌హ‌ద్‌పై 3వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News December 5, 2024

ఇకపై ప్రతినెలా రెండుసార్లు క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాలను ఇకపై నెలకు రెండుసార్లు(మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు CS నీరభ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం భేటీ జరగనుంది. సమావేశాలకు 3 రోజుల ముందుగానే అన్ని శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖకు పంపాలని CS సూచించారు. కాగా ఈ నెల 19న రెండో మంత్రివర్గ సమావేశం జరగనుంది.

News December 5, 2024

IND vs AUS: రెండో టెస్టుకు వరుణుడి గండం

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ మ్యాచుకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తర్వాతి నాలుగు రోజుల్లో వాన పడే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. కాగా తొలి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.

News December 5, 2024

నేడు ప్రోబా-3 ప్రయోగం

image

AP: శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు సా.4.12 గంటలకు PSLV C59 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. నిన్న జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ESAకు చెందిన ప్రోబా-3 శాటిలైట్‌ను సైంటిస్టులు నింగిలోకి పంపనున్నారు. దీనిద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్‌ కరోనాను అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగంలో స్పెయిన్, పోలాండ్, ఇటలీ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.