News September 15, 2024
కోహ్లీ నుంచి బాబర్ నేర్చుకోవాలి: యూనిస్ ఖాన్
విరాట్ కోహ్లీని చూసి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చాలా నేర్చుకోవాలని ఆ దేశ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ సూచించారు. ‘బాబర్‌పై చాలా అంచనాలున్నాయి. తన ఫిట్‌నెస్, క్రమశిక్షణపై అతడు దృష్టి సారించాలి. కెప్టెన్సీ చిన్న విషయం. ప్రదర్శనే ముఖ్యం. విరాట్‌ను చూడండి. కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నా బ్యాటింగ్ రికార్డులు బద్దలుగొడుతున్నారు. దేశానికి ఆడటాన్ని ఎంతగా ప్రేమిస్తాడన్నదానికి అదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2024
నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు
మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా 36 ఏళ్లుగా న్యూజిలాండ్ మన గడ్డపై సిరీస్ గెలవలేదు. ఇప్పుడైనా గెలిచి ఆ రికార్డును తుడిచేయాలని కివీస్ భావిస్తోంది. మరోవైపు టీమ్ ఇండియాకు సొంత గడ్డపై ఎదురేలేకుండా పోతోంది. 2013 నుంచి ఇక్కడ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు.
News October 16, 2024
నేడు క్యాబినెట్ భేటీ.. కొత్త పాలసీలపై చర్చ
AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఐదారు రంగాలకు చెందిన కొత్త పాలసీలపై చర్చించి, ఆమోదించే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, MSMEలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన విధానాలపై చర్చించనున్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు10% ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నారు.
News October 16, 2024
SBI క్రెడిట్‌కార్డు యూజర్లకు గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా ఉన్న 19.5 మిలియన్ల SBI క్రెడిట్ కార్డు యూజర్లకు సంస్థ శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సందర్భంగా ‘ఖుషియోన్ కా ఉత్సవ్’ పేరుతో కొనుగోళ్లపై ప్రత్యేక <