News November 21, 2024

బాబోయ్.. చలి వణికిస్తోంది

image

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్యం నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ప్రజలు జ్వరాలు, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Similar News

News November 21, 2024

ధనుష్‌తో వివాదం వేళ నయనతార మరో ట్వీట్

image

నెట్‌ఫ్లిక్స్ తనపై రూపొందించిన డాక్యుమెంటరీలో తమ సినిమాల ఫుటేజ్‌ను వాడుకునేందుకు అనుమతినిచ్చిన నిర్మాతలకు నయనతార కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా తనకు NOC ఇచ్చారంటూ చిరంజీవి, షారుఖ్ ఖాన్‌, రామ్ చరణ్ సహా పలువురి పేర్లను ఆమె ప్రకటించారు. కాగా ‘నానుమ్ రౌడీ దానే’ మూవీ క్లిప్స్ వాడుకునేందుకు హీరో ధనుష్ NOC ఇవ్వకుండా రూ.10 కోట్లు డిమాండ్ చేయడంపై ఇటీవల నయన్ ఆగ్రహించిన సంగతి తెలిసిందే.

News November 21, 2024

అద్దె బస్సుల ఛార్జీలు తగ్గించిన TGSRTC

image

పెళ్లిళ్లు, టూర్ల కోసం ప్రయాణికులకు అద్దెకు ఇచ్చే బస్సుల ఛార్జీలను TGSRTC తగ్గించింది. పల్లె వెలుగు బస్సు అద్దె గతంలో కిలోమీటర్‌కు రూ.68 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.52కు తగ్గించింది. ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.69 తీసుకోగా ఇప్పుడు రూ.62కు కుదించింది. డీలక్స్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.65 నుంచి రూ.57కు తగ్గించింది. సూపర్ లగ్జరీ బస్సులకు రూ.65 నుంచి రూ.59కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

News November 21, 2024

BREAKING: కేసుపై స్పందించిన అదానీ గ్రూప్

image

వ్యాపారవేత్త గౌతం అదానీపై USలోని న్యూయార్క్‌లో నమోదైన లంచం, ఫ్రాడ్ <<14666429>>కేసుపై <<>>అదానీ గ్రూప్ స్పందించింది. అవన్నీ అసత్య ఆరోపణలేనని తేల్చి చెప్పింది. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పింది.