News April 25, 2024
ఫ్రస్ట్రేషన్‌లో బాబు, పవన్: సజ్జల

AP: TDP చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ తాపత్రయపడుతున్నారు. ఆయన ఆడుతున్న నాటకంలో పవన్ ఓ పాత్రధారి. కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీకి వేయించేందుకు పవన్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాబుకు పవన్ ఎందుకు లొంగిపోయారో చెప్పాలి’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News January 21, 2026
ముంబైపై ఢిల్లీ ఘన విజయం

WPL: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(51*), లీ(46) చెలరేగడంతో 155 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అమన్‌జోత్ కౌర్, వైష్ణవికి చెరో వికెట్ దక్కింది. ముంబై బ్యాటర్లలో బ్రంట్(65), హర్మన్ ప్రీత్(41) మాత్రమే రాణించారు.
News January 21, 2026
JAN 25 లేదా 26న ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి వివేక్

TG: ఈ నెల 25 లేదా 26న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్(D) నర్సాపూర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ రాణికుముదిని ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News January 21, 2026
అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారిస్తాం: సజ్జనార్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారణకు పిలుస్తామని HYD CP, సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. ‘ఈ కేసులో హరీశ్‌ను ఇవాళ విచారించాం. ఆయనకు సుప్రీంకోర్టులో స్టే రాలేదు. తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా ముందుగా బయల్దేరి వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చాం. కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించాం’ అని చెప్పారు. ఇవాళ 7గంటలకు పైగా హరీశ్ రావును సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.


