News October 9, 2024
బాబుకు చింత చచ్చినా పులుపు చావలేదు: రోజా
AP: CM చంద్రబాబు తీరు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుందని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలు గాయపరిచారని మండిపడ్డారు. ‘CBI సిట్ వేసిన సుప్రీం రాజకీయ విమర్శలు చేయొద్దని ఆదేశించింది. కానీ దానిపై తాను మాట్లాడకుండా తన అనుకూల మీడియాలో కల్తీ వార్తలు ప్రచారం చేయిస్తున్నారు. కల్తీ రాజకీయాలు చేసేవారే కల్తీ ప్రచారాన్ని నమ్ముతారు’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News November 6, 2024
IPL వేలంలోకి అండర్సన్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ IPL మెగా వేలంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 42 ఏళ్ల ఆటగాడు చివరిసారి 2011, 2012లో వేలంలో పాల్గొనగా ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఆ తర్వాత అండర్సన్ IPL వైపు తొంగిచూడలేదు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత IPLలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.
News November 6, 2024
EXIT POLL: ఓటర్లను ప్రభావితం చేస్తున్న 5 అంశాలివే..
అమెరికా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్న 5 ప్రధాన అంశాలను ‘ఎడిసన్ రీసెర్చ్’ తొలి ఎర్లీ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించింది. 35% మందిని ‘ప్రజాస్వామ్యం’, 31% మంది ‘ఎకానమీ’, 14% మంది ‘అబార్షన్’ అంశం, 11% మంది ‘వలస విధానం’, 4% మందిని ‘విదేశీ పాలసీ’ ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యం, అబార్షన్ అంశాలు కమలకు, ఎకానమీ, వలస విధానం ట్రంప్‌నకు కలిసొస్తున్నట్లు సర్వేలో తేలింది.
News November 6, 2024
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నటి భర్త
నటి స్వర భాస్కర్ భర్త ఫాహద్ అహ్మద్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ముంబైలోని అనుశక్తి నగర్ నుంచి ఆయన NCP-SP తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న ఆయన ఇటీవలే NCP-SPలో చేరారు. ఎన్నికల్లో ప్రచారం కోసం తన భర్త క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసినట్లు స్వర ట్వీట్ చేశారు. అతడికి మద్దతుగా నిలిచి విరాళాలు అందించాలని అభ్యర్థించారు. గతేడాది అహ్మద్‌ను స్వర పెళ్లి చేసుకున్నారు.