News December 9, 2024
RBI కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేపథ్యం
RBI గవర్నర్‌గా నియమితులైన సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ క్యాడర్ IAS అధికారి. IIT కాన్పూర్‌లో Graduation, Princeton University నుంచి పబ్లిక్ పాలసీలో Masters చేశారు. కేంద్ర ఆర్థిక శాఖలోనూ పని చేశారు. రాజస్థాన్‌లో విద్యుత్ విభాగ ప్రధాన కార్యదర్శిగా సంస్కరణలకు పునాది వేశారు. ఆర్థిక సేవలు, ఎనర్జీ, IT, మైనింగ్, Taxation రంగాల్లో ఆయనకు 33 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది.
Similar News
News January 17, 2025
VIRAL: అప్పట్లో రూ.18కే తులం బంగారం
మార్కెట్‌లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. నిత్యం రూ.వందల్లో పెరుగుతూ అప్పుడప్పుడూ తగ్గుతూ మధ్యతరగతి ప్రజలను ఊరిస్తుంటుంది. అసలు వందేళ్ల క్రితం పది గ్రాములు బంగారం ధర ఎంతుందో తెలుసా? 1925లో దీని ధర రూ.18.75 ఉండగా 2025లో రూ.80,620గా ఉంది. 1959లో తొలిసారి రూ.100 దాటి రూ.102.56కి 1980లో తొలిసారి వెయ్యి దాటి రూ.1330, 1985లో రూ.2130, 1996లో రూ.5160, 2007లో రూ.10,800 కాగా 2022లో రూ.52వేలకు చేరింది.
News January 17, 2025
రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల
TG: గ్రూప్-2 ‘కీ’ రేపటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో వస్తుందని టీజీపీఎస్సీ పేర్కొంది. ఈనెల 18 నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను తెలపొచ్చని వెల్లడించింది. కాగా డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్ష జరిగింది.
News January 17, 2025
సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్‌ను అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే సైఫ్ వెంట ఏడేళ్ల కుమారుడు తైమూర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఒళ్లంతా రక్తంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లాడితో కలిసి తన ఆటో ఎక్కాడని, ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ఆయనను సైఫ్‌గా గుర్తుపట్టినట్లు అతడు చెప్పారు.