News September 23, 2024
యాంటీబయాటిక్స్‌కు స్పందించని బ్యాక్టీరియాలు
దేశంలో పలు ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే యాంటీబయాటిక్స్‌కు కొన్ని రకాల బ్యాక్టీరియాలు స్పందించడం లేదని కొత్త అధ్యయనం తేల్చింది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లు (UTI), బ్లడ్ ఇన్ఫెక్షన్‌లు, న్యుమోనియా, టైఫాయిడ్ వంటి కొన్ని వ్యాధులకు చికిత్స పద్ధతులు కష్టతరంగా మారుతున్నాయి. ఎందుకంటే వాటికి కారణమయ్యే బ్యాక్టీరియా సాధారణ యాంటీబయాటిక్‌లకు స్పందించడం లేదని ICMR-AMRSN జరిపిన అధ్యయనంలో తేలింది.
Similar News
News October 11, 2024
Jobs Info: ఆఫర్ లెటర్స్ పంపడం ఆపేస్తున్న ఇన్ఫోసిస్
Infosys హైరింగ్ ప్రాసెస్ మొత్తం మార్చేస్తోందని సమాచారం. జాబ్ ఆఫర్లు, అటాచ్‌మెంట్లను ఈ-మెయిళ్లకు పంపించదు. ఇకపై ఉద్యోగార్థులే కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్స్‌లో లాగినై అప్లికేషన్ డీటెయిల్స్‌ను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మోసాలు, స్కామ్‌లు జరగకుండా, హైరింగ్ ప్రాసెస్‌ను మరింత సౌకర్యంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. https://career.infosys.com/offerValidationలోనే ఆఫర్ లెటర్లు ఇవ్వనుంది.
News October 11, 2024
తెలంగాణలో సమగ్ర కులగణన.. ఇంటింటి సర్వే
TG: సమగ్ర కులగణనపై రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు. సర్వే బాధ్యతను ప్రణాళికశాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
News October 11, 2024
స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఆటలా?: గుడివాడ అమర్నాథ్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై CM చంద్రబాబు కన్‌ఫ్యూజ్ చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ‘NDAలో భాగస్వామిగా ఉండి కూడా ప్రైవేటీకరణ ఆపలేరా? దేశంలో ఎన్నో స్టీల్ ప్లాంట్‌లు ఉన్నా, దీనినే ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? సెయిల్‌లో ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు.