News August 3, 2024
ఘోరం: తల్లికి చీమలు.. పట్టించుకోని కొడుకులు
TG: ఇద్దరు కొడుకులున్నా ఏం ప్రయోజనం? ఆ తల్లి జీవచ్ఛవంలా మంచం పట్టింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన కొమరమ్మ(73) పెద్ద కొడుకు వరంగల్‌లో ఉండగా, ఆమె చిన్న కొడుకుతో ఉంటున్నారు. ఇటీవల ఆమె కింద పడి గాయాలపాలు కావడంతో ఆస్పత్రిలో చూపించి, చికిత్స పూర్తికాక ముందే ఇంటికి తీసుకొచ్చేశారు. మంచం పట్టిన ఆ తల్లిని చీమలు తింటున్నా కొడుకు, కోడలు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 15, 2024
వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?
ఇప్పుడైతే వినాయకులను POPతో చేస్తున్నారుగానీ ఒకప్పుడు చెరువులోని స్వచ్ఛమైన ఒండ్రుమట్టితోనే తయారుచేసేవారు. లంబోదరుడిని పూజించే 21రకాల పత్రిల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ప్రవహించే నదులు, వాగులతో పాటు చెరువుల్లోని నీరు సర్పాలు ఇతర కీటకాలతో విషపూరితమవుతాయి. ఒండ్రుమట్టి వినాయకులను నిమజ్జనం చేసి, పత్రిలను వాటిలో వదిలితే నీరు శుద్ధి అవడంతో పాటు ఔషధగుణాలు కలగలుస్తాయని పండితులు చెబుతున్నారు.
News September 15, 2024
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం.. 600 ప్రత్యేక బస్సులు
TG: ఎల్లుండి వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా HYDలోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. GHMC పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15-30 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సదుపాయాన్ని వినియోగించుకొని నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
News September 15, 2024
వరద బాధితులకు భారీ విరాళం
AP: రాష్ట్రంలో వరద బాధితులకు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రూ.7.70 కోట్ల విరాళం అందజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెక్కు అందజేసినట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు YVB రాజేంద్ర తెలిపారు. వరద బాధితుల కోసం రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం ఇచ్చామన్నారు.