News September 27, 2024
IPL అభిమానులకు బ్యాడ్ న్యూస్?
IPL-2025లో మ్యాచ్‌ల సంఖ్యను 84కు పెంచేది లేదని BCCI తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి 74 మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా వచ్చే సీజన్‌లో 84 మ్యాచ్‌లు ఆడించాలని గతంలో BCCI యోచించింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 9, 2024
టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు
AP: మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి వీరిద్దరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
News October 9, 2024
ఉమెన్స్ WC: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: షఫాలీ, మంధాన, జెమిమా, హర్మన్(C), రిచా, దీప్తి, సాజన, అరుంధతి, శ్రేయాంక, శోభన, రేణుక.
SL: విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(C), హర్షిత, కవిష, నీలాక్షి, అనుష్క, కాంచన, సుగంధిక, ఇనోషి, ఉదేషికా, ఇనోక.
News October 9, 2024
రతన్ టాటా ఆరోగ్యం విషమం?
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. తన ఆరోగ్యం బాగుందంటూ టాటా 2 రోజుల క్రితమే స్పష్టతనిచ్చారు. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అవే వార్తలు రావడం గమనార్హం.