News March 8, 2025

ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

image

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌కు తొలి రెండు వారాలపాటు ఆయన దూరం కానున్నారని సమాచారం. ముంబై ఆడే తొలి 4, 5 మ్యాచులకు ఆయన మిస్ అవుతారని టాక్. ఆ తర్వాత జట్టుతో చేరతారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని COEలో కోలుకుంటున్నారు. గాయంతోనే ఆయన బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

Similar News

News January 15, 2026

BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా

image

ముంబై మున్సిపల్ (BMC) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ, ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేనకు 131-151 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల కూటమి 58-68, కాంగ్రెస్‌ 12-16 వార్డులు గెలుచుకుంటాయని పేర్కొంది. కాగా BMCలో మొత్తం 227 వార్డులకు ఇవాళ ఎన్నికలు జరగ్గా, రేపు ఫలితాలు రానున్నాయి.

News January 15, 2026

షుగర్ తగ్గాలా? తిన్న తర్వాత 10 నిమిషాలు ఇలా చేయండి!

image

బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవడానికి కఠినమైన డైట్లు, భారీ వ్యాయామాలు అవసరం లేదని AIIMSలో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కేవలం 10 ని.ల నడక మందులకన్నా బాగా పనిచేస్తుందని తెలిపారు. నడిచినప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌ను కండరాలు ఇంధనంగా వాడుకుంటాయి. దీంతో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ సడన్‌గా పెరగవు. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి కాలేయంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.

News January 15, 2026

సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు

image

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశువులను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశుపక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది’ అని పేర్కొన్నారు.