News October 8, 2024
రామ్ చరణ్ అభిమానులకు BAD NEWS
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ఈ దసరాకి టీజర్ విడుదలయ్యేలా కనిపించట్లేదు. టీజర్ విడుదలవకపోతే నిరాశపడవద్దని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అభిమానులకు సూచించారు. ‘వీడియోను ఫైనల్ చేసేందుకు టీమ్ కృషి చేస్తోంది. CG VFX షాట్స్ ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. అన్ని సాంగ్స్ లిరికల్ వీడియోల పనులను పూర్తి చేస్తున్నాం. DEC 20 లేదా క్రిస్మస్‌కి విడుదలవుతుంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 13, 2024
అణు రియాక్టర్లపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
థర్మల్ ప్లాంట్ల గడువు ముగిసినా, లేదా బొగ్గు సదుపాయం లేని రాష్ట్రాలు అణు విద్యుత్ ప్లాంట్లు ప్రారంభించాలని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ సూచించారు. కరెంట్‌కు నానాటికీ డిమాండ్ పెరుగుతోందని తాజాగా జరిగిన విద్యుత్ మంత్రుల సదస్సులో గుర్తుచేశారు. దేశంలో 24 అణువిద్యుత్ ప్లాంట్స్ నుంచి 8 గిగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా 2032 కల్లా దాన్ని 20 గి.వాట్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.
News November 13, 2024
అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు సమంజసమే: హైకోర్టు
AP: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తే తప్పేం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్ వేయగా ధర్మాసనం ఇవాళ విచారించింది.
News November 13, 2024
ప్రభుత్వాలు ‘బుల్డోజర్ యాక్షన్’ ఎలా తీసుకోవచ్చంటే..
అక్రమ కట్టడాలపై <<14598300>>బుల్డోజర్<<>> యాక్షన్‌కు దిగేముందే పాటించాల్సిన గైడ్‌లైన్స్‌ను SC వివరించింది. ఆ ప్రాపర్టీ ఓనర్‌కు 15days ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలంది. ఒకటి రిజిస్టర్ పోస్టులో పంపాలని, మరోటి ప్రాపర్టీపై నేరుగా అతికించాలని సూచించింది. ఉల్లంఘించిన రూల్స్, కూల్చివేతకు కారణాలు వివరించాలని, కూల్చివేతను వీడియో తీయించాలని ఆదేశించింది. ఇందులో ఏది పాటించకున్నా కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామంది.