News October 2, 2024
టీమ్ ఇండియాకు BAD NEWS!

ఆస్ట్రేలియాతో కీలకమైన 5 టెస్టుల సిరీస్కు ముందు టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ షమీ ఆ సిరీస్కు దూరం కానున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. షమీ మోకాళ్లలో వాపు వచ్చిందని, అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో BCCI మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొంది. అతడు పూర్తిగా కోలుకునేందుకు 6-8 వారాల సమయం పడుతుందని తెలిపింది. కాగా NOV 22 నుంచి AUSతో సిరీస్ ప్రారంభం కానుంది.
Similar News
News December 5, 2025
కోతుల సమస్యలపై కార్యాచరణ రూపొందించాలి: కలెక్టర్

కోతుల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పోడు భూముల పట్టా ఉన్నవారు ఎవరైనా అడవి జంతువుల వేటకు పాల్పడిన, అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నించిన గతంలో జారీ చేసిన పట్టా రద్దు చేయాలని చెప్పారు. యువత, పిల్లలను ఆకర్షించేలా అర్బన్ పార్క్లో జంతువులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డుపై ఎక్కడ కూడా కోతులకు ఆహార పదార్థాలు ఇవ్వవద్దని పేర్కొన్నారు.
News December 5, 2025
జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్లను సంప్రదించాలి.
News December 5, 2025
గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు

AP: విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు 480 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ(D)లోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి(D)లోని రాంబిల్లిలో భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. గూగుల్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్ఫ్రా పేరున కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా వెయ్యి మెగా వాట్ల ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది.


