News October 2, 2024

టీమ్ ఇండియాకు BAD NEWS!

image

ఆస్ట్రేలియాతో కీలకమైన 5 టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ షమీ ఆ సిరీస్‌కు దూరం కానున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. షమీ మోకాళ్లలో వాపు వచ్చిందని, అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో BCCI మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొంది. అతడు పూర్తిగా కోలుకునేందుకు 6-8 వారాల సమయం పడుతుందని తెలిపింది. కాగా NOV 22 నుంచి AUSతో సిరీస్ ప్రారంభం కానుంది.

Similar News

News October 7, 2024

సలార్-2 నుంచి క్రేజీ లీక్స్.. PHOTOS వైరల్

image

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సలార్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్ శౌర్యాంగపర్వంపై అంచనాలు పెరిగాయి. గతంలోనే ఈ చిత్ర షూటింగ్ కొంత పూర్తవగా, దీనికి సంబంధించి టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్ వైరలవుతున్నాయి. కాటేరమ్మ ఫైట్ కంటే క్రేజీగా ఉంటుందని టాక్. ఈ లీక్స్‌పై మేకర్స్ స్పందించలేదు. ప్రస్తుతం డైరెక్టర్, హీరో బిజీగా ఉండటంతో రెండో భాగం షూటింగ్ మరింత ఆలస్యం కానుంది.

News October 7, 2024

5Gపై ఫోకస్ తగ్గించిన రిలయన్స్ JIO

image

JIO 5G నెట్‌వర్క్ విస్తరణ వేగాన్ని తగ్గిస్తోంది. 4G యూజర్లు ఎక్కువ డబ్బులు చెల్లించే సేవలకు అప్‌గ్రేడ్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. Airtel సైతం ఫీచర్ ఫోన్లు వాడేవారిని స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవి వేగం పుంజుకొనేంత వరకు అవసరమైన 5G ఆపరేషన్స్ మాత్రమే కొనసాగిస్తాయని తెలిసింది. జియో 5G నెట్‌వర్క్ యుటిలైజేషన్ 15% ఉందని వెండర్స్, రెట్టింపు ఉంటుందని కంపెనీ సోర్సెస్ అంటున్నాయి.

News October 7, 2024

అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు భారీ వర్షాలు

image

ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.