News April 8, 2024
బత్తాయి, నిమ్మ రైతులకు గడ్డుకాలం

TG: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో బత్తాయి, నిమ్మ తోటలు ఎండిపోయాయి. ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గుతుంటే.. ఇప్పుడు వర్షాలు లేక రైతులకు మరింత గడ్డుకాలం వచ్చింది. 15ఏళ్ల క్రితం 3.24లక్షల ఎకరాల్లో బత్తాయి, 2.20లక్షల ఎకరాల్లో నిమ్మ సాగయ్యేది. సుమారు 10లక్షల కుటుంబాలు వీటిపై ఆధారపడేవి. ఈఏడాది బత్తాయి సాగు లక్ష నుంచి 76వేల ఎకరాలకు తగ్గింది. నిమ్మ సాగు సైతం ఈ ఏడాది 19 వేల ఎకరాలు తగ్గింది.
Similar News
News December 16, 2025
స్పిన్నర్‌కు భారీ ధర

లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ జాక్‌పాట్ కొట్టారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన ఆయన్ను రూ.7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక ఫిన్ అలెన్(రూ.2 కోట్లు)ను కేకేఆర్, జేకబ్ డఫ్ఫీ(రూ.2 కోట్లు)ని ఆర్సీబీ, అకేల్ హోసేన్(రూ.2 కోట్లు)ను సీఎస్కే కొనుగోలు చేశాయి. ఇక అభినవ్ మనోహర్, తీక్షణ, మ్యాట్ హెన్రీ, జెమీ స్మిత్, గుర్బాజ్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.
News December 16, 2025
పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదు: కేటీఆర్

TG: పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదని, అది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సొంత ఇళ్లు అమ్మి కాంగ్రెస్ నేతలు నిధులివ్వడం లేదని ఫైరయ్యారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లను తెలంగాణ భవన్‌లో ఇవాళ కేటీఆర్ సన్మానించారు.
News December 16, 2025
MAIDSలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని <


