News August 1, 2024
BADMINTON: సింధూ సాధించేనా?
ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీ ప్రీక్వార్టర్స్‌లో భాగంగా మరికాసేపట్లో జరగనున్న పీవీ సింధు-హీ బింగ్ జియో (చైనా) మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. హెడ్ టు హెడ్ రికార్డ్‌లో హీ బింగ్ 11 సార్లు గెలుపొందగా సింధు ఖాతాలో ఆ సంఖ్య తొమ్మిదిగా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ హోరాహోరీగా సాగొచ్చని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. సింధు ఈ మ్యాచ్ గెలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News October 7, 2024
మూడు పూటల కష్టం.. ఫలితం 33 పైసలు
వినియోగదారులు చెల్లించే ధరలో కూరగాయలు, పండ్ల రైతులు 30% మాత్రమే పొందుతున్నారని RBI ఓ రిపోర్టులో పేర్కొంది. అంటే మనం KG ₹100కు కొంటే వారికి ₹30 దక్కుతోంది. మిగతాది దళారులు, టోకు వర్తకులు, రిటైల్ వ్యాపారులు వంటి వారికి వెళ్తోంది. కొన్ని పంటలు చూస్తే టమాటాలకు 33%, ఆలూ- 37%, అరటి- 31%, మామిడి: 43%, ద్రాక్ష: 35% చొప్పున శ్రమజీవికి చెందుతోంది. ఇక డెయిరీ, గుడ్ల రైతులకు మాత్రం ఇది 70%, 75% కావడం గమనార్హం.
News October 7, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రేపు మన్యం, అల్లూరి, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది.
News October 7, 2024
Aiతో తెలుగు రాష్ట్రాల్లో 122M స్పామ్ కాల్స్ బ్లాక్: AIRTEL
స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు Airtel నెట్‌వర్క్‌లో <<14250922>>ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్<<>>ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెల 27 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీతో వినియోగదారులకు స్పామ్ కాల్స్ బెడద గణనీయంగా తగ్గింది. ఈ పదిరోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 122 మిలియన్ల స్పామ్ కాల్స్, 2.3M మెసేజ్లను బ్లాక్ చేసినట్లు AIRTEL తెలిపింది. ఈ ఫీచర్ ప్రతీ యూజర్‌కు అందుబాటులో ఉందని పేర్కొంది.