News May 22, 2024
ర్యాష్ డ్రైవింగ్ కేసులో మైనర్‌కు బెయిల్ రద్దు

ర్యాష్ డ్రైవింగ్‌తో పుణేలో ఇద్దరి మరణానికి కారణమైన 17 ఏళ్ల బాలుడికి జస్టిస్ జువైనల్ బోర్డు బెయిల్ రద్దు చేసింది. మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన మైనర్‌ని పిల్లల పరిశీలన కేంద్రానికి పంపనున్నట్లు పేర్కొంది. జూన్ 5 వరకు నిందితుడిని రిమాండ్ హోమ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. నేరం తీవ్రత కారణంగా అతడిని పెద్దవాడిగానే పరిగణనలోకి తీసుకోవాలని పుణే పోలీసులు కోర్టును కోరుతున్నారు.
Similar News
News April 18, 2026
మారని కోల్‘కథ’.. ఇక ఇంటికేనా?

IPL 2026లో KKR పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 6 మ్యాచుల్లో 5 ఓడగా, వర్షం వల్ల ఒకటి రద్దయింది. ఇంకా 8 మ్యాచులు మిగిలి ఉండటంతో కనీసం 7 గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం టీమ్ ఆట తీరు చూస్తే అది అనుమానమే. ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా అనేలా తయారైంది పరిస్థితి. అసాధారణ రీతిలో పుంజుకుంటే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం దాదాపు అసాధ్యం. మీరేమంటారు?
News April 18, 2026
గాడిదలా నటించమని అడిగినా సరే..: ఆర్య

దర్శకులు బాల, పా.రంజిత్‌ను తాను ఎంతో నమ్ముతానని తమిళ హీరో ఆర్య చెప్పారు. వాళ్లతో సినిమాలకు స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. ‘నాకు కథ చెప్పకుండానే వెట్టువమ్ మూవీని రంజిత్ తీస్తున్నారు. బాల సర్ నన్ను గాడిదగా చేయమన్నా సరే చేసేస్తా. నెల రోజుల్లో అఘోరీ లుక్(నేనే దేవుడ్ని) కోసం సిద్ధమవ్వాలని చెప్పి నన్ను హీరోగా సెలక్ట్ చేశారు’ అని ‘మిస్టర్ ఎక్స్’ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పారు.
News April 18, 2026
డీ‘లిటిగేషన్’.. గెలిచిందెవరు?

131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో <<19674859>>వీగిపోవడం<<>> తమ విజయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా బిల్లు గట్టెక్కలేదని, ఇది ప్రజాస్వామ్య గెలుపు అని చెబుతున్నాయి. BJP మాత్రం మహిళా కోటాకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని ప్రజల్లోకి వెళ్తోంది. ఈ ప్రభావం బెంగాల్, TN ఎన్నికల్లో ఉంటుందని భావిస్తోంది. అందుకే సంఖ్యా బలం లేకున్నా బిల్లు పెట్టిందనే చర్చ సాగుతోంది. దీనిపై మీ కామెంట్.


