News September 2, 2024

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరొకరికి బెయిల్

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 23 నెలల తర్వాత AAP నేత విజయ్ నాయర్‌కు బెయిల్ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి అయిన విజయ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కస్టడీలో ఉన్నారు. తన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయ స్థానం తాజాగా ఆయనకు బెయిల్ ఇచ్చింది. విజయ్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనూ వాదించారు.

Similar News

News December 8, 2025

ఇంటి పేరు వద్దనుకున్న సమంత?

image

టాలీవుడ్ హీరోయిన్ సమంత తన పేరును మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పేరు ‘సమంత రూత్ ప్రభు’ అని ఉంది. ఇటీవలే రాజ్ నిడిమోరును పెళ్లాడిన ఆమె తన పేరు పక్కన ఎవరి ఇంటి పేరును పెట్టుకునేందుకు ఇష్టపడట్లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. తన ఇంటి పేరును కూడా తొలగించి కేవలం ‘సమంత’ అనే బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. కాగా అంతకుముందు సమంత అక్కినేని అని ఉండేది.

News December 8, 2025

విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం

image

ఇండిగో(ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌) షేర్లు ఇవాళ ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం నష్టపోయాయి. తర్వాత కాస్త ఎగసినా మళ్లీ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 406 పాయింట్లు కోల్పోయి(7.6 శాతం) 4,964 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత 5 రోజుల్లో ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు.

News December 8, 2025

వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

image

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.