News August 27, 2024
కవితకు బెయిల్.. మాట్లాడకుండా వెళ్లిపోయిన కేటీఆర్

కవితకు బెయిల్ మంజూరు కాగానే కేటీఆర్, హరీశ్ రావు తదితర బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు నుంచి బయటికి వచ్చారు. మీడియా ఆయనను చుట్టుముట్టగా కేటీఆర్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. అయితే కాసేపటి తర్వాత ఆయన దీనిపై స్పందించే అవకాశం ఉంది.
Similar News
News April 19, 2026
రేపు రైతుభరోసా నిధులు విడుదల.. సీఎం షెడ్యూల్ ఇదే

TG: రైతుభరోసా రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కాటారం వెళ్లి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.
News April 19, 2026
పాక్‌లో రేపు చర్చలు.. డీల్ చేసుకోవాల్సిందే: ట్రంప్

ఇరాన్‌తో చర్చలకు తమ బృందం రేపు సాయంత్రానికి పాకిస్థాన్ చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. డీల్ కుదుర్చుకోకపోతే ప్రతీ పవర్ ప్లాంట్, బ్రిడ్జ్‌లను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. హార్ముజ్‌లో ఫ్రెంచ్, యూకే నౌకలపై ఇరాన్ బోట్లు దాడి చేయడం సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
News April 19, 2026
IPL: అద్భుత విజయం

IPL-2026: గెలుపు అసాధ్యం అనుకున్న దశలో KKR అద్భుత విజయం సాధించింది. RR నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యఛేదనలో తొలుత వరుసగా వికెట్లు కోల్పోయింది. 70కే 5 వికెట్లు పడిన దశలో రింకూ (53*), అనుకుల్ రాయ్ (29*) బౌండరీలతో మ్యాచును గెలిపించారు. వీరిద్దరూ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్లో KKRకు ఇదే తొలి విజయం.


