News October 3, 2024

జానీ మాస్టర్‌కు బెయిల్

image

మహిళా కొరియోగ్రాఫర్‌‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని ‘మేఘం కరిగేనా’ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు అందుకోవడానికి ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.

Similar News

News November 12, 2024

BIG ALERT.. రేపు భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News November 12, 2024

ఆస్ట్రేలియాలో రహస్యంగా టీమ్ ఇండియా సాధన?

image

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముంగిట ప్రాక్టీస్‌ను రహస్యంగా ఉంచాలని టీమ్ ఇండియా భావిస్తున్నట్లు ది వెస్ట్ ఆస్ట్రేలియన్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. IND ప్రాక్టీస్ చేస్తున్న పెర్త్‌‌కి ప్రేక్షకుల్ని రానివ్వడం లేదని పేర్కొంది. సిబ్బంది సైతం ఫోన్లను తీసుకెళ్లకుండా కఠిన నిబంధనల్ని భారత్ అనుసరిస్తోందని తెలిపింది. ప్రాక్టీస్ మ్యాచ్‌ కూడా ఆడకుండా కేవలం సిములేషన్‌తోనే సాధన చేస్తున్నట్లు వెల్లడించింది.

News November 12, 2024

తప్పకుండా చదవాల్సిన తెలుగు పుస్తకాలు!

image

పుస్తకాలు చదవడం వల్ల మనిషికి తన గురించీ, సమాజం గురించీ, ప్రకృతి గురించీ అవగాహన పెరుగుతుందంటారు. అయితే, ఏ పుస్తకాలు చదవాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసమే ఓ నెటిజన్ పుస్తకాలు, వాటి రచయితకు సంబంధించిన జాబితాను షేర్ చేశారు. ఇందులో గురజాడ రాసిన కన్యాశుల్కం నుంచి మొదలై వందల పుస్తకాలున్నాయి. వీటిలో మీరెన్ని పుస్తకాలు చదివారు? ఏ పుస్తకమంటే ఇష్టమో కామెంట్ చేయండి. పుస్తక ప్రియులకు షేర్ చేయండి.