News September 12, 2025

బజరంగ్‌ పునియా తండ్రి కన్నుమూత

image

భారత రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత బజరంగ్‌ పునియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి బల్వాన్ పునియా ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో గత 18 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు తన తండ్రి చాలా కష్టపడ్డారని, కుటుంబానికి ఆయనే వెన్నెముక అని బజరంగ్‌ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Similar News

News March 4, 2026

T20 WC ఎఫెక్ట్.. బాబర్‌పై పాక్ వేటు!

image

T20 WCలో విఫలమైన పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్‌పై PCB వేటువేసింది. బంగ్లాదేశ్‌తో జరిగే ODI సిరీస్‌ నుంచి అతడిని పక్కన పెట్టింది. షాహీన్ అఫ్రీది కెప్టెన్‌గా 15 మందితో స్క్వాడ్‌ను తాజాగా ప్రకటించింది. ఇందులో ఆరుగురు కొత్త ప్లేయర్లను తీసుకోవడం గమనార్హం. ఈ నెల 11 నుంచి పాక్-బంగ్లా మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. T20 WCలో 4 ఇన్నింగ్స్‌లలో బాబర్ 91 పరుగులే చేశారు. అత్యధికంగా UAEపై 46 రన్స్ కొట్టారు.

News March 4, 2026

NATO దేశమైన తుర్కియేపైకి ఇరాన్ మిస్సైల్

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరిన్ని దేశాలకు పాకే అవకాశం ఉంది. NATO సభ్య దేశమైన తుర్కియేపైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ఫైర్ చేసింది. ఇరాక్, సిరియా దేశాలపై నుంచి ఈ మిస్సైల్ దూసుకొచ్చిందని, దాన్ని NATO ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుందని తుర్కియే మంత్రి వెల్లడించారు. సిరియా సరిహద్దుల్లో శకలాలు పడ్డాయన్నారు. కాగా NATO దేశంపై దాడి జరిగితే మిగతా సభ్య దేశాలూ రంగంలోకి దిగాలనే నిబంధన ఉంది.

News March 4, 2026

శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత నీకుందా జగన్: బీఆర్ నాయుడు

image

AP: హిందుత్వం గురించి మాట్లాడే అర్హత <<19295165>>జగన్‌కు<<>> లేదని టీటీడీ ఛైర్మన్ BR నాయుడు విమర్శించారు. శ్రీవారి పేరు ఉచ్చరించే నైతికత ఆయనకు లేదని ఫైరయ్యారు. ‘హిందూ వ్యతిరేకి అయిన నువ్వు CMగా ఉన్నావనే వైవీ, భూమన హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారు. నేను ఛైర్మన్ అయ్యాక TTDని ప్రక్షాళన చేస్తున్నా. అందుకే నాపై ఫేక్ వీడియోలతో తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూశావు’ అని మండిపడ్డారు.