News August 29, 2024
బాలకృష్ణ వింటేజ్ లుక్.. పిక్స్ వైరల్

సినీనటుడు, MLA నందమూరి బాలకృష్ణ వింటేజ్ లుక్‌లో కనిపించారు. ‘చెన్నకేశవరెడ్డి’, ‘నరసింహనాయుుడు’ లుక్‌లో మరోసారి దర్శనమిచ్చారు. ఓ యాడ్ షూటింగ్ కోసం ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరవుతారు.
Similar News
News November 7, 2025
అది పాకిస్థాన్ చరిత్రలోనే ఉంది: భారత్

అణ్వాయుధాలను <<18185605>>పరీక్షిస్తున్న<<>>దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. రహస్య, చట్ట విరుద్ధ అణు కార్యక్రమాలు నిర్వహించడం పాక్ చరిత్రలోనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విమర్శించారు. దశాబ్దాలపాటు స్మగ్లింగ్, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు నిర్వహించిందని అన్నారు. ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నామన్నారు.
News November 7, 2025
కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.
News November 7, 2025
చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.


