News May 11, 2024
బాలకృష్ణ, దత్తపుత్రుడికి ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇచ్చాం: జగన్

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ‘బాలకృష్ణ రిషికొండలో, దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నారు. వీరిద్దరిని అడుగుతున్నా.. మీకు ఒరిజనల్ డాక్యుమెంట్లు ఇచ్చారా? జిరాక్సులిచ్చారా? ఏపీలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న 9 లక్షల మందికి ఒరిజనల్ డాక్యుమెంట్లే ఇచ్చాం. చంద్రబాబు కుట్రలతో పథకాల నగదును లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.
Similar News
News February 18, 2025
సిక్కుల తలపాగాలు తీయించిన అమెరికా?

అక్రమ వలసదారుల్ని అమెరికా భారత్‌కు పంపించేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజా విమానంలో సిక్కుల తలపాగాలను తీయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 116మంది వలసదారులతో కూడిన విమానం నిన్న అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఎలాగూ వెనక్కి పంపిస్తున్న అమెరికా, ఇలాంటి పనులు చేయడమేంటంటూ వలసదారులు మండిపడుతున్నారు.
News February 18, 2025
మా నాయకత్వాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుంది: సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో ‘లీడర్‌షిప్ రొటేషన్’లో భాగంగా సీఎంగా సిద్ధరామయ్యను తప్పించి మరో నేతను కాంగ్రెస్ ఎంపిక చేస్తుందన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. కర్ణాటకలో నాయకత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుందని, దాని గురించి పెద్ద చర్చ అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శివకుమార్‌కు సీఎం పదవి రావొచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
News February 18, 2025
ఢిల్లీ తొక్కిసలాటలో కుట్ర కోణం లేదు: రైల్వే మంత్రి

ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చిచెప్పారు. ‘తొక్కిసలాట జరిగేంత రద్దీ కూడా రైల్వే స్టేషన్లో లేదు. కుట్రేమీ లేదని భావిస్తున్నాం. ప్రస్తుతం సీసీటీవీ పర్యవేక్షణ మరింతగా పెంచాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ స్టేషన్‌కు ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 8 కంపెనీల పారామిలిటరీ బలగాల్ని స్టేషన్‌కు లోపల, బయటా మోహరించినట్లు అధికారులు తెలిపారు.