News March 30, 2024
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి

AP: మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేన పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇదివరకే ప్రకటించారు. అటు 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తుండగా.. పాలకొండ, అవనిగడ్డ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Similar News
News January 4, 2026
‘జెలెన్స్కీని పుతిన్ బంధిస్తే?’.. ట్రంప్పై రో ఖన్నా ఫైర్!

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ను భారత సంతతి US MP రో ఖన్నా తప్పుబట్టారు. ఇది ఒక అనవసర యుద్ధమని విమర్శించారు. ‘ఇలాంటి దాడుల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పుతిన్ బంధిస్తే? లేదా తైవాన్ నేతలపై చైనా దాడి చేస్తే అప్పుడు మనం ఏమనగలం?’ అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా నైతిక బలాన్ని కోల్పోతుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.
News January 4, 2026
మదురోను బంధించిన డెల్టా ఫోర్స్.. అసలు ఎవరీ కిల్లర్ టీమ్?

US సైన్యంలో అత్యంత రహస్యమైన, పవర్ఫుల్ విభాగం డెల్టా ఫోర్స్. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇందులో చేరడం చాలా కష్టం. వీరు యూనిఫామ్ ధరించకుండా సాధారణ పౌరుల్లా ఉంటూ రహస్య ఆపరేషన్లు చేస్తారు. సద్దాం హుస్సేన్ పట్టివేత, అల్ బగ్దాదీ హతం తాజాగా మదురో అరెస్ట్ వంటి మిషన్లు వీరే చేశారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ టెక్నాలజీతో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేయడం వీరి స్పెషాలిటీ.
News January 4, 2026
అపార ఖనిజాలు.. అస్తవ్యస్త పాలన.. అంధకారం

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత వెనిజులాకు సరిపోతుంది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్నది అక్కడే (18%-$17 ట్రిలియన్స్). ఐరన్, బాక్సైట్, కాపర్, జింక్, బంగారం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ కంపోనెంట్స్లో వాడే నికెల్ నిక్షేపాలూ అపారం. కానీ సొంత&విదేశీ శక్తులతో ప్రభుత్వంలో అస్థిరత వల్ల వాటిని తవ్వి, రిఫైన్ చేసే టెక్నాలజీ, రవాణా ఇబ్బందులతో వెనిజులా భయంకర ఆర్థిక మాంద్యంలో ఉంది.


