News March 30, 2024
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి

AP: మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేన పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇదివరకే ప్రకటించారు. అటు 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తుండగా.. పాలకొండ, అవనిగడ్డ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Similar News
News February 8, 2026
రాజాసాబ్ OTT: మారుతిని రఫ్పాడిస్తున్నారు!

రెబల్ ఫ్యాన్స్ మరోసారి డైరెక్టర్ మారుతిని ఆడుకుంటున్నారు. OTTలో రాజాసాబ్ స్ట్రీమ్ అవుతుండటంతో, అందులోని తప్పులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో చాలాచోట్ల ప్రభాస్ డూప్‌ను వాడారని తెలిసిపోయిందని స్క్రీన్ షాట్స్‌తో ట్రోల్ జరుగుతోంది. బస్ జర్నీలో హీరోకు గడ్డం ఉండి, దిగేసరికి ట్రిమ్ అయిందని, బస్సే మారిందని, ఆస్తి పొందిన కనకరాజు(సంజయ్‌దత్) ఎందుకు పారిపోవాలనే ప్రశ్నలతో రఫ్పాడిస్తున్నారు.
News February 8, 2026
ఒకే ప్రాపర్టీని మళ్లీ మళ్లీ అమ్మి.. రూ.500 కోట్ల మోసం!

ఒకే ప్రాపర్టీని మళ్లీ మళ్లీ అమ్మి ఘరానా మోసం చేశారో కంపెనీ CEO. గురుగ్రామ్(హరియాణా)లో ప్రాజెక్టు చేపట్టానని, నెలవారీ ఆదాయం ఉంటుందని ఇన్వెస్టర్లను ‘32nd Avenue’ CEO ధ్రువ్ దత్ శర్మ నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి ₹కోట్లు తీసుకున్నారు. రిటర్న్స్ అడిగితే చేతులెత్తేశారు. బాధితుల ఫిర్యాదుతో ఫ్రాడ్ బయటపడింది. ధ్రువ్ ₹500 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు చెప్పారు. వెయ్యి మంది బాధితులున్నారని తెలిపారు.
News February 8, 2026
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో 21 పోస్టులు

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<


