News September 3, 2024
తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించిన బాలయ్య

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్కి రూ.50 లక్షల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. తన బాధ్యతగా బాధిత ప్రజలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు జూ.ఎన్టీఆర్, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్సేన్ తమ వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 5, 2026
వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!

బ్యాంకు ఉద్యోగుల <<18765252>>సమ్మెతో<<>> దేశవ్యాప్తంగా వరుసగా 4 రోజులు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. JAN 24, 25 తేదీల్లో శని, ఆదివారాలు బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. 26న గణతంత్ర దినోత్సవం నాడు పబ్లిక్ హాలిడే, 27న స్ట్రైక్ ఉండటంతో బ్యాంకులు బంద్ కానున్నాయి. దీంతో శనివారం నుంచి మంగళవారం వరకు ఇబ్బందులు తప్పవు. తిరిగి బుధవారం నుంచి బ్యాంకులు తెరుచుకోనున్నాయి. కాబట్టి ముందుగానే బ్యాంకు పనులు చేసుకుంటే బెటర్.
News January 5, 2026
AIIMS నాగపూర్లో 86 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News January 5, 2026
వరి నాట్లు.. ఇలా చేస్తే అధిక ప్రయోజనం

వరి రకాల పంట కాలాన్ని బట్టి 22-28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. వరి నారు కొనలను తుంచి నాటితే కాండం తొలుచు పురుగు, ఇతర పురుగుల గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటితే పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.


