News September 3, 2024
తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించిన బాలయ్య
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కి రూ.50 లక్షల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. తన బాధ్యతగా బాధిత ప్రజలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు జూ.ఎన్టీఆర్, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ తమ వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 17, 2024
కొనసాగుతున్న సీఎంల రాజీనామా ఒరవడి
ప్రభుత్వంలో కుమ్ములాటలు, MLAల ఫిరాయింపులు, కోర్టు కేసుల వల్ల ఇటీవల పదవిలో ఉన్న CMలు రాజీనామాలు చేస్తున్న ఒరవడి కొనసాగుతోంది. గతంలో MHలో ఉద్ధవ్ ఠాక్రే, MPలో కమలనాథ్, ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, హరియాణలో మనోహర్ లాల్, KAలో యడియూరప్ప, గుజరాత్‌లో విజయ్ రూపాని, ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ పదవిలో ఉండగా రాజీనామా చేశారు. తాజాగా ఢిల్లీ CM కేజ్రీవాల్ ఈ జాబితాలో చేరనున్నారు.
News September 16, 2024
వివ్ రిచర్డ్స్‌తో తల్లి సంబంధం వల్ల వేధింపులు ఎదుర్కొన్నా: మసాబా గుప్తా
విండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో తన తల్లికి ఉన్న సంబంధం వల్ల 7వ తరగతిలోనే వేధింపులకు గురైనట్టు నేనా గుప్తా కుమార్తె మసాబా గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి గర్భం దాల్చినప్పుడు తనది అక్రమ సంతానంగా భావిస్తూ నేనా గుప్తా తల్లిదండ్రులు ఎవరూ చూట్టూ లేరని, తన తండ్రి రిచర్డ్స్ కూడా లేరన్నారు. తాను శారీరకంగా ఎలా ఉన్నది, లేదా ఎందుకలా ఉన్నది కూడా చాలా మందికి అర్థం కాలేదన్నారు.
News September 16, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షం కురవనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.