News November 12, 2024

FBలో బాల్కనీ వీడియో పోస్టు.. అరెస్టు

image

బెంగళూరులోని MSRనగర్‌లో దంపతులు సాగర్ గురుంగ్, ఊర్మిళ నివసిస్తున్నారు. ఇటీవల ఊర్మిళ తమ బాల్కనీలోని గార్డెన్‌‌ను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అయితే ఆ గార్డెన్‌లో ఉన్న మొక్కల్లో 2 గంజాయి మొక్కలున్నట్లు వీడియోలో కనిపించింది. వీడియో కాస్తా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంకేముంది పోలీసులు అక్కడికి వెళ్లి ప్రశ్నించగా ఆ కపుల్ తడబడ్డారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు.

Similar News

News January 16, 2026

ఎల్లుండి ‘మౌని అమావాస్య’.. ఏం చేయాలి?

image

మౌని(చొల్లంగి) అమావాస్య ఈ ఏడాది JAN 18న వచ్చింది. 18న 12.03amకి ప్రారంభమై 19న 1.21amకు ముగుస్తుంది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని నమ్మకం. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నీళ్లు, నువ్వులతో తర్పణాలు వదిలితే వారు ఉత్తమ లోకాలకు చేరుకొని ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు. మౌన వ్రతం, శివుడికి రుద్రాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందట.

News January 16, 2026

20న BJPకి కొత్త బాస్.. నితిన్ నబీన్ ఎన్నిక లాంఛనమే!

image

BJP నూతన జాతీయాధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 19న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, అదే రోజు పత్రాల పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. అవసరమైతే 20న ఓటింగ్ నిర్వహించి కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ వేసే అవకాశం ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనమే!

News January 16, 2026

పట్టుచీర కట్టిన తర్వాత..

image

* చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేస్తే సరిపోతుంది. * చీరలను కట్టిన వెంటనే కాకుండా నాలుగైదు సార్లు కట్టిన తర్వాత డ్రై క్లీనింగ్‌కి ఇస్తే సరిపోతుంది. * కొత్త చీరలను డిటర్జెంట్ పౌడర్, షాంపూలతో వాష్ చేస్తారు. అలాంటప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని ఎంచుకోవాలి. * ఎంబ్రాయిడరీ, ఇతర వర్కులు ఉన్న హెవీ చీరలను చేత్తోనే ఉతకడం మంచిది. * రెండు, మూడు చీరలు ఉతకాల్సి వచ్చినపుడు వేటికవే విడిగా ఉతకాలి.