News November 12, 2024

FBలో బాల్కనీ వీడియో పోస్టు.. అరెస్టు

image

బెంగళూరులోని MSRనగర్‌లో దంపతులు సాగర్ గురుంగ్, ఊర్మిళ నివసిస్తున్నారు. ఇటీవల ఊర్మిళ తమ బాల్కనీలోని గార్డెన్‌‌ను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అయితే ఆ గార్డెన్‌లో ఉన్న మొక్కల్లో 2 గంజాయి మొక్కలున్నట్లు వీడియోలో కనిపించింది. వీడియో కాస్తా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంకేముంది పోలీసులు అక్కడికి వెళ్లి ప్రశ్నించగా ఆ కపుల్ తడబడ్డారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు.

Similar News

News April 19, 2026

పవన్ త్వరలోనే కోలుకుంటారు: ప్రధాని మోదీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు. ఆయన త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. సైనసైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు నిన్న <<19687368>>సర్జరీ<<>> జరిగిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

అనిల్ రావిపూడి సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్?

image

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమా కోసం తొలిసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన తెరకెక్కించబోయే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్ కుమార్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అనిల్ డైరెక్ట్ చేసిన గత రెండు సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించారు. అవి సూపర్ హిట్టయినా మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చడం ఆసక్తికరంగా మారింది.

News April 19, 2026

ఆ జట్ల మధ్యే 13 IPL ట్రోఫీలు.. కానీ!

image

ముంబై, చెన్నై, కోల్‌కతా జట్ల ప్రదర్శన వాటి ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఈ మూడు జట్లే ఏకంగా 13 IPL ట్రోఫీలు(MI-5, CSK-5, KKR-3) గెలవగా ప్రస్తుత సీజన్‌లో తేలిపోయాయి. 6 మ్యాచుల్లో 2 విజయాలతో చెన్నై PTలో 7వ స్థానంలో ఉంది. ఇక 5 మ్యాచుల్లో 1 గెలుపుతో MI 9, 6 మ్యాచుల్లో 5 ఓటమి, ఒక డ్రాతో KKR చివరి స్థానాల్లో ఉన్నాయి. 3 జట్లలోనూ కెప్టెన్లు రాణించకపోవడం మైనస్. ఇకనైనా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.