News March 19, 2024
అంతరిక్షంలో అణ్వాయుధాలపై నిషేధం!
న్యూక్లియర్ వెపన్స్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడంపై UN నిషేధం విధించే దిశగా అమెరికా, జపాన్ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై యూఎన్‌లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నాయి. స్పేస్‌లోకి ఆయుధాలను పంపించడం మొదలైతే అది వినాశనానికి దారి తీస్తుందని జపాన్ విదేశాంగ మంత్రి యోకో కమికవా పేర్కొన్నారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని సభ్య దేశాలన్నీ ఇందుకు సహకరించాలని అమెరికా కోరింది.
Similar News
News September 11, 2024
ఓటీటీలోకి కొత్త సినిమాలు
హరీశ్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ రేపటి(సెప్టెంబర్ 12) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. అలాగే చిన్న సినిమాగా విడుదలై హిట్‌గా నిలిచిన ‘ఆయ్’ కూడా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు విక్రమ్ ‘తంగలాన్’ మూవీ ఈనెల 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
News September 11, 2024
రాష్ట్రంలో 8,915కు చేరిన ఎంబీబీఎస్ సీట్లు
TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరగా MBBS సీట్ల సంఖ్య 4,315కు చేరింది. ప్రైవేట్ కాలేజీలతో కలిపి మొత్తంగా ఈ సంఖ్య 8,915గా ఉంది. మరోవైపు కొత్త కాలేజీలకు అనుమతులిచ్చిన కేంద్రానికి, నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌కు వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు.
News September 11, 2024
తుంగభద్ర ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం!
కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. 22వ గేటు దిగువన భారీ గొయ్యి ఏర్పడిందని నిపుణుల కమిటీ పేర్కొంది. దీంతో జలాశయం పునాదులకు ప్రమాదమని అధికారులను అప్రమత్తం చేసింది. డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు సరస్సులోకి నీటి కోసం ఏర్పాటు చేసిన తూముల నుంచి లీకేజీ కావడంతో డ్యామ్‌కు ప్రమాదం ఉండొచ్చని సూచించింది. ఇటీవలే డ్యామ్ గేట్ ఊడిపోవడంతో సరిచేసిన సంగతి తెలిసిందే.