News May 4, 2024

ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

image

ఉల్లి ధరల్ని నియంత్రణలో ఉంచేందుకు భారత సర్కారు ఉల్లి ఎగుమతిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా పేర్కొంది. ఎగుమతి ధరను టన్నుకు రూ.45,860గా నిర్ణయించింది. నిషేధం వలన తమకు రాబడి తగ్గిందంటూ మహారాష్ట్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Similar News

News January 16, 2026

సొంతింటి ‘బడ్జెట్’కు నిర్మలమ్మ బూస్ట్?

image

వచ్చే బడ్జెట్‌లో ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఊపిరిపోయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ₹45 లక్షల ధర పరిమితిని ₹75 లక్షల నుంచి ₹95 లక్షల వరకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నా సామాన్యుడికి ఇల్లు భారమవుతోందని.. పన్ను రాయితీలు, అద్దె గృహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హోమ్ లోన్ వడ్డీ మినహాయింపును ₹5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.

News January 16, 2026

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 5 ఏళ్ల జైలు

image

దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ విధించి విఫలమైన మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అరెస్టు కాకుండా అధికారులను అడ్డుకోవడం, పత్రాల ఫోర్జరీ వంటి కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. ఆ దేశ చరిత్రలో పదవిలో ఉండగా అరెస్టయిన తొలి అధ్యక్షుడు ఆయన. అయితే ఆయనపై ఉన్న అత్యంత తీవ్రమైన ‘రాజద్రోహం’ కేసులో ప్రాసిక్యూటర్లు మరణశిక్ష కోరగా.. దానిపై ఫిబ్రవరిలో తుది తీర్పు వెలువడనుంది.

News January 16, 2026

ESIC మెడికల్ కాలేజీ&హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

నోయిడాలోని<> ESIC <<>>మెడికల్ కాలేజీ&హాస్పిటల్‌ 19 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 27న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, PG/DNB/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. SC/ST/PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in